కారు డ్రైవర్ కొడుకు పెండ్లికి సూపర్ స్టార్.. ఇంకా ఎందరో..
డ్రైవర్ అశోక్ సింగ్ కుమారుడి వివాహానికి హాజరైన వారిలో సల్మాన్‌ఖాన్‌తోపాటు ఆయన తండ్రి, ప్రముఖ రచయిత సలీమ్ ఖాన్, సోదరుడు సోహైల్ ఖాన్, చెల్లెళ్లు అర్పిత, అల్వీరా ఉన్నారు.
సినీ పరిశ్రమలో అగ్ర నటులు సొంత కుటుంబాలు, బంధువుల శుభకార్యాలకు వెళ్లడమే చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. అలాంటిది బాలీవుడ్‌లో అగ్ర హీరో సల్మాన్ ఖాన్ తన కారు డ్రైవర్ అశోక్ సింగ్ కుమారుడి పెళ్లికి కుటుంబ సభ్యులతో హాజరయ్యాడు.

సల్లూభాయ్ కుటుంబం డ్రైవర్ అశోక్ సింగ్ ను సొంత కుటుంబ సభ్యుడిగా ట్రీట్ చేయడమే కాకుండా భాయ్ అని ముద్దుగా పిలుచుకొంటారు.

డ్రైవర్ అశోక్ సింగ్ కుమారుడి వివాహానికి హాజరైన వారిలో సల్మాన్‌ఖాన్‌తోపాటు ఆయన తండ్రి, ప్రముఖ రచయిత సలీమ్ ఖాన్, సోదరుడు సోహైల్ ఖాన్, చెల్లెళ్లు అర్పిత, అల్వీరా ఉన్నారు. వీరితో పాటు సల్మాన్ బావ, అల్వీరా భర్త, ఒకప్పటి బాలీవుడ్ హీరో అతుల్ అగ్నిహోత్రి కూడా పెండ్లికి హాజరయ్యారు.
సాధారణంగా ప్రజా జీవితంలో అనేక అపవాదులు ఎదుర్కొంటున్న సల్మాన్ ఖాన్ డ్రైవర్ పెండ్లికి హాజరై వధూవరులను కుటుంబ సభ్యులతో సహా ఆశీర్వదించడంపై పలువురు ప్రశంసిస్తున్నారు.

వేడుకలో చిరునవ్వులు చిందిస్తున్న స్టార్ కుటుంబానికి సంబంధించిన చిత్రాలను జాతీయ దినపత్రిక దైనిక్ భాస్కర్ కెమెరాలో బంధించింది.


Click it and Unblock the Notifications











