»   »  ఒక్క సూపర్ స్టార్ తోనే నేను పోటీ పడతా: పవర్ స్టార్

ఒక్క సూపర్ స్టార్ తోనే నేను పోటీ పడతా: పవర్ స్టార్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ తో మాత్రమే నేను పోటీ పడతాను....మిగతా స్టార్స్ ఎవరూ నాకు అసలు పోటీనే కాదు అంటూ సంచలన కామెంట్ చేసారు తమిళ కమెడీ హీరో, తమిళనాట పవర్ స్టార్ గా పిలవడే శ్రీనివాసన్. ఆయన నటించిన తమిళ చిత్రం 'వంగా వంగా' ఆడియో రిలీజ్ చెన్నైలో జరిగింది. ఈ సందర్భంగా పవర్ స్టార్ శ్రీనివాసన్ ఈ వ్యాఖ్యలు చేసారు. ఈ చిత్రానికి ఇస్మాయిల్ దర్శకత్వం వహిస్తున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఫేస్ బుక్ వినయోగం అనే అంశంతో 'వంగా వంగా' సినిమా తెరకెక్కుతోంది. నేషనల్ అవార్డ్ విన్నర్ అప్పుకుట్టి ఈ చిత్రంలో అసిస్టెంట్ డైరెక్టర్ పాత్ర చేస్తుండగా పవర్ స్టార్ శ్రీనివాసన్ నిర్మాతగా నటిస్తున్నారు.

Powerstar Srinivasan

ఆడియో వేడుక సందర్భంగా శ్రీనివాసన్ తన కామెడీ స్పీచ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తనను తాను లేట్ యాక్టర్ సిల్క్ స్మితతో పోల్చుకున్నారు. ఓ నిర్మాత తనను సినిమాలో డాన్స్ నెంబర్ చేయాల్సిందిగా రూ. 8 లక్షలు ఆఫర్ చేసారని, అయితే తాను మరో రెండు లక్షలు కలిపి 10 లక్షలు రౌండ్ ఫిగర్ ఇవ్వమని అడిగాను. కాని ఆయన ఇది సిల్క్ స్మితకు ఇచ్చేదానికంటే ఎక్కువ అన్నారు. దానికి నేను మగ సిల్క్ అన్నాను అంటూ వ్యాఖ్యనించారు.

రజనీకాంత్ కాంత్ గురించి మాట్లాడుతూ... నేను రజనీ సార్ ను ఎంతో ఆరాధిస్తాను. ఆయన సెల్ఫ్ కాన్ఫిడెన్స్, హార్డ్ వర్క్, పట్టుదల ఈ స్థాయికి చేర్చాయి. ఆయన కెరీర్లో ఎన్నో అప్ డౌన్స్ ఉన్నాయి, ఎంతో కష్టపడ్డారు. నేను కూడా ఆయన్నే ఫాలో అవుతున్నాను. అందుకే ఆయన్నే నేను కాంపిటీటర్ గా భావిస్తున్నాను అన్నారు.

English summary
Rajinikanth is my only competitor in the film industry, claimed comedian Powerstar Srinivasan at the audio launch of his upcoming flick Vaanga Vaanga. Ismail is directing the film, which talks about the impact of Facebook in rural areas! While national award-winner Appu Kutty essays an assistant director, Powerstar plays a producer in VV.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X