»   » మహేష్ బాబును అడ్డం పెట్టుకుని బెదిరిస్తున్నారు..! (ఫోటోస్)

మహేష్ బాబును అడ్డం పెట్టుకుని బెదిరిస్తున్నారు..! (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబును కిడ్నాప్ చేసారనే కథాంశంతో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. 'సూపర్ స్టార్ కిడ్నాప్' అనేది ఈ చిత్ర కథాంశం. క్రైం, కామెడీ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సుశాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్రం ఆడియో జులై 13న ప్లాన్ చేసారు. హైదరాబాద్ లోని జేఆర్‌సి కన్వెన్షన్ హాలులో జులై 13న సాయంత్రం 7 గంటల నుండి ఆడియో వేడుక జరుగనుంది. 'సూపర్ స్టార్‌ను కిడ్నాప్ చేసాం. మా కంట్రోల్ లోనే ఉన్నాడు. జులై 13న సాయంత్రం 7 గంటలకు హార్ట్ ఫుల్ అమౌంటుతో లైవ్ లోకి రండి. మీ సూపర్ స్టార్ మా కంట్రోల్ లో ఉన్నాడు కాబట్టి పోలీసులకు చెప్పే సాహసం చేయొద్దు' అంటూ వెరైటీగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

నందు ఆదర్శ్, భూపాల్, పూనమ్ కౌర్, శ్రద్ధాదాస్ నటీనటులు. ఎ.సుశాంత్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మహేష్ బాబును కిడ్నాప్ చేయాలనే కథతో ఈ సినిమా సాగుతుంది. ఈ కామెడీ సినిమాలో శ్రద్ధా దాస్ ఒక రౌడీ పాత్రలో కనిపించనుంది. స్లైడ్ షోలో మరిన్ని వివరాలు, ఫోటోలు...

సూపర్ స్టార్ కొడ్నాప్

సూపర్ స్టార్ కొడ్నాప్

ఎ.సత్తిబాబు సమర్పణలో లక్కీ క్రియేషన్స్ పతాకంపై చందు పెన్మత్స నిర్మాతగా రూపొందుతున్న చిత్రం ‘సూపర్ స్టార్ కిడ్నాప్'

ఆసక్తిగా...

ఆసక్తిగా...

పాపులారిటీ, పబ్లిసిటీ లేని కొత్త వారు తీసే చిన్న సినిమాలు చూసే పరిస్థితి ఇండస్ట్రీలో లేదనే చెప్పాలి. అందుకే ఇలాంటి సినిమాల వైపు ప్రేక్షకులను వచ్చేలా రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు ఫిల్మ్ మేకర్స్. అలాంటి ప్రయత్నమే చేస్తున్నారు ‘సూపర్ స్టార్ కిడ్నాప్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న దర్శక నిర్మాతలు. మహేష్ బాబును కొడ్నాప్ చేయాలనే కథాంశంతో ఈ సినిమా రాబోతోంది. మహేష్ బాబును కిడ్నాప్ చేసే కథ అనగానే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొనడం సహజమే.

శ్రద్ధా దాస్...

శ్రద్ధా దాస్...

ఈ కామెడీ సినిమాలో శ్రద్ధా దాస్ ఒక రౌడీ పాత్రలో కనిపించనుంది. ‘తన పాత్ర ‘ఫాస్ గయా రే ఒబామా' అనే హింది సినిమాలో నేహ దుపియా చేసిన పాత్రలా ఉంటుందని', శ్రద్ధా అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ...

దర్శకుడు మాట్లాడుతూ...

దర్శకుడు మాట్లాడుతూ...కొన్ని ఊహించని సంఘటనల వల్ల చిక్కల్లో పడిన ముగ్గురు యువకులు సూపర్ స్టార్ మహేష్ బాబును కిడ్నాప్ చేయాలనుకుంటారు. వాళ్లు వేసుకున్న ప్లాన్ ప్రకారం కిడ్నాప్ చేసారా? లేదా అనేది కథ. క్రామ్ కామెడీ సినిమా సాగుతుంది. ప్రేక్షకులు ఉత్కంఠకు గురి చేసే విధంగా సినిమా ఉంటుంది అన్నారు.

English summary
Superstar Kidnap, a crime comedy directed by Sushanth Reddy, is finally gearing up for release after a long delay. The film stars Bhupal, Adarsh, Vennela Kishore and host of other cameos. Shraddha Das has played an important role and she'll be seen as a powerful goon. The film's post-production is in the final stage and now, we hear that, the audio is going to be launched on July 13 in Hyderabad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu