For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Krishna Funeral:కృష్ణ పార్థివదేహం తరలింపులో గందరగోళం.. ఆ కార్యక్రమం రద్దు, అక్కడే అంత్యక్రియలు

  |

  సూపర్ స్టార్ కృష్ణ మరణాన్ని ఇటు సినీ, రాజీయ సెలబ్రిటీలు, అటు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఆయన కుటుంబసభ్యులు అయితే తీవ్ర శోకసంద్రలో మునిగిపోయారు. మహేశ్ బాబుతో సహా మిగతా కుటుంబ సభ్యులను ఓదార్చేందుకు సినీ ప్రముఖులు, రాజకీయా నాయకులు ఒక్కొక్కరిగా తరలివెళ్లారు. అయితే ప్రముఖుల సందర్శనార్థం సూపర్ స్టార్ కృష్ణ పార్థివదేహాన్ని నానక్ రామ్ గూడలోని ఆయన నివాసానికి తరించిన విషయం తెలిసిందే. అక్కడ ఇవాళ సాయంత్ర నాలుగు గంటల వరకు ఆయన పార్థివదేహాన్ని ఉంచి సాయంత్రం గచ్చిబౌలి స్టేడియంలో అభిమానుల సందర్శానార్థం కృష్ణ భౌతిక కాయాన్ని ఉంచనున్నారని సినీ వర్గాలు వెల్లడించాయి. అయితే ఇప్పుడు ఆ కార్యక్రమంలో మార్పుులు చోటుచేసుకున్నాయి.

   మల్టీపుల్ ఆర్గాన్స్ ఫెయిల్..

  మల్టీపుల్ ఆర్గాన్స్ ఫెయిల్..

  నటుడు, నిర్మాత, దర్శకుడు, సూపర్ స్టార్, నట శేఖర కృష్ణ ఆకస్మిక మరణం యావత్ సినీ లోకానికి తీరని లోటు మిగిల్చింది. సూపర్ స్టార్ కృష్ణ మరణ వార్త అభిమానులను, సినీ ప్రముఖులను, రాజకీయ వేత్తలను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. ఇటీవల ఆయన కుటుబంలో జరిగిన వరుస విషాదాలను తట్టుకొని ఆరోగ్యంగా కనిపించిన ఆయనను ఆదివారం రాత్రి గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్‌కు తరలించారు. అయితే గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన ఆయనకు మల్టీపుల్ ఆర్గాన్స్ ఫెయిల్ కావడంతో కృష్ణ ఆరోగ్య పరిస్థితి విషమించింది.

   ఉలిక్కిపడిన సినీ లోకం..

  ఉలిక్కిపడిన సినీ లోకం..

  వెంటిలేటర్ సహాయంతో సూపర్ స్టార్ కృష్ణకు చికిత్స అందించారు. కాంటినెంటల్ ఆసుపత్రిలో అంతర్జాతీయ సదుపాయాలతో ఎనిమిది మంది వైద్యులతో కూడిన బృందం నిరంతరం పర్యవేక్షిస్తూ చికిత్స అందించింది. ఆయనను బతికించేందుకు వైద్యులు విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. అయితే చికిత్సకు ముందు అందుకు ఆయన శరీరం చికిత్సకు సహకరిస్తుందో లేదో అని వైద్యులు సందేహించిన విషయం తెలిసిందే. చివరిగా సూపర్ స్టార్ కృష్ణ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. సూపర్ స్టార్ కృష్ణ మరణంతో యావత్ సినీ లోకం ఉలిక్కిపడింది. ప్రముఖుల సందర్శనార్థం హాస్పిటల్ నుంచి నానక్ రామ్ గూడలోని ఆయన నివాసానికి తరలించారు.

  పద్మాలయ స్టూడియో వద్ద పార్థివదేహం..

  పద్మాలయ స్టూడియో వద్ద పార్థివదేహం..

  ముందుగా ఇవాళ సాయంత్రం 4 గంటలవరకు కృష్ణ పార్థివదేహాన్ని అక్కడే ఉంచి తర్వాత గచ్చిబౌలి స్టేడియంలో అభిమానుల కోసం తరలించాలని భావించారు. అందుకు భారీ ఏర్పాట్లు సైతం ఏర్పాటు చేశారు. అయితే పలు అనివార్య కారణాల వల్ల ఆ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కృష్ణ కుటుంబ సభ్యులు తెలిపారు. బుధవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నాం 12:30 గంటల వరకు పద్మాలయ స్టూడియో వద్ద అభిమానుల సందర్శనార్థం కృష్ణ పార్థివదేహాన్ని ఉంచనున్నారు. అనంతరం అంతిమయాత్ర నిర్వహించనున్నామని కుటుంబసభ్యులు వెల్లడించినట్లు సమాచారం.

   సూర్యాస్తమయం కావడంతోనే..

  సూర్యాస్తమయం కావడంతోనే..

  మంగళవారం అంటే ఇవాళ సూర్యాస్తమయం కావడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రేపు (బుధవారం) మధ్యాహ్నాం మాహా ప్రస్థానంలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సూపర్ స్టార్ కృష్ణ పార్థివ దేహానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని సీఎం కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ను సీఎం ఆదేశించారు.

  English summary
  Superstar Krishna Passed Away And His Funeral On November 16 Evening At Mahaprasthanam
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X