»   » పుట్టిన రోజున మహేష్ ఎక్కడ,ఎలా గడిపాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు

పుట్టిన రోజున మహేష్ ఎక్కడ,ఎలా గడిపాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :ప్రిన్స్ మహేష్ బాబు నిన్న అంటే మంగళవారం ఆగస్టు 9 వ తేదీన తన పుట్టిన రోజు జరుపుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పుట్టిన రోజుని ఆయన ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనే విషయం అందరికీ ఆసక్తే. ముఖ్యంగా అభిమానులకు ఆయన ఎక్కడ పుట్టిన రోజు జరుపుకున్నారు. ఎవరితో కలిసి సెలబ్రెట్ చేసుకున్నారు వంటి విషయాలు తెలుసుకోవాలని ఉంటుంది. ఆ విషయాలు మేం అందిస్తున్నాం.

ఎప్పటిలాగే మహేష్ బాబు తన పుట్టిన రోజును కూడా ఫ్యామిలీతో కలిసి ఆనందంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బైలింగ్యువల్ సినిమాలో నటిస్తున్న సూపర్ స్టార్, బర్త్ డే రోజున బ్రేక్ తీసుకొని మరి.. ఫ్యామిలీతో ఎంజాయ్ చేశాడు.

భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సితారలతో కలిసి హైదరాబాద్ తాజ్ ఫలక్ నామా ప్యాలస్ కు వెళ్లిన మహేష్, అక్కడి అందాలను, టేస్టీ ఫుడ్ ను ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసాడని సమాచారం. అంతేకాదు తన తండ్రి కృష్ణగారిని కలిసి బ్లెస్సింగ్ తీసుకున్నారు. అదండీ విషయం.

కెరీర్ విషయానికి వస్తే.. మహేష్ బాబు వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ తో ముందుకు వెళ్తున్నాడు. బ్రహ్మోత్సవం దెబ్బ నుంచి వెంటనే కోలుకున్నమహేష్, ఆచి,తూచి అడుగులు వేస్తూ..వరుస సినిమాలను రెడీ చేస్తున్నాడు. ఇప్పటికే మురుగదాస్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ యాక్షన్ డ్రామాను ప్రారంభించాడు.

ఈ సినిమా తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పీవీపీ సినిమా బ్యానర్ లో సినిమాకు ఓకె చెప్పేశాడు. ఊపిరి సినిమాతో మంచి సక్సెస్ సాధించిన వంశీ, మహేష్ కోసం స్టైలిష్ ఎంటర్ టైనర్ ను రెడీ చేశాడు. ఈ రెండు సినిమాలతో పాటు కొరటాల శివ దర్శకత్వంలోనూ మరో సినిమా చేసేందుకు అంగీకరించాడు.

ఇక మహేష్ పర్శనల్ లైఫ్ గురించి మరిన్ని విశేషాలు ఇక్కడ చూద్దాం...

థియేటర్‌కు..

థియేటర్‌కు..

మహేష్‌ ఇక్కడ థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడరట. కేవలం సినిమాలు చూడడానికే ముంబయి వెళ్తారట. ఇక్కడ థియేటర్లకు వెళ్తే తన వల్ల తోటి ప్రేక్షకులకు ఇబ్బంది కలగకూడదని.

నటుడు కాకపోయి ఉంటే..

నటుడు కాకపోయి ఉంటే..

అసలు మహేష్ కు చిన్నప్పటి నుంచి యాక్టింగ్‌ తప్ప వేరే విషయమే తెలియదు. కాబట్టి ఈ ప్రశ్నే లేదు

సిగరెట్‌ మానేశారు

సిగరెట్‌ మానేశారు

మహేష్ బాబు...చైన్ స్మోకర్ ట. అయితే ‘ఈజీ వే టు స్టాప్‌ స్మోకింగ్‌' అనే పుస్తకం చదవి స్మోకింగ్‌ మానేశారట.

ఇష్టమైన రంగు

ఇష్టమైన రంగు

మహేష్‌బాబుకు నీలం రంగు అంటే ఇష్టమట. ఆ షేడ్స్‌లోనే ఎక్కువగా దుస్తులు కొంటారట.

భరిస్తారు

భరిస్తారు

విడి రోజుల్లోనే కాదు షూటింగ్‌ జరుగుతున్న రోజుల్లో కూడా మహేష్‌ తన ఫ్యామిలీ ట్రావెల్‌, అసిస్టెంట్ల జీతాలు, ఖర్చులు.. అన్ని ఆయనే భరిస్తారట ప్రొడ్యూసర్‌కు భారం కాకూడదని.

ఎవరికి వీర ఫ్యాన్ అంటే

ఎవరికి వీర ఫ్యాన్ అంటే

మహేష్‌బాబు సచిన్‌కు వీరాభిమాని. ఆయన లైఫ్‌స్టైల్‌ అన్నీ గొప్పగా ఉంటాయని చెబుతారు.

జీవితాశయం

జీవితాశయం

మహేష్‌బాబు జీవితాశయం 90 ఏళ్లు వచ్చే వరకు నటించడమట.

మిస్సైంది

మిస్సైంది

మహేష్‌బాబును హీరోగా పరిచయం చేయాలనుకునే అవకాశం తొలుత క్రియేటివ్‌ దర్శకుడు కృష్ణవంశీకి వచ్చిందట. అయితే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదు. ఇక ఆ అవకాశాన్ని దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు అందిపుచ్చుకున్నారు.

తండ్రి గెస్ట్ రోల్

తండ్రి గెస్ట్ రోల్

‘రాజకుమారుడు'గా మహేష్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చి, తొలి సినిమాతోనే విజయాన్ని అందుకున్నారు. అప్పటివరకు కృష్ణ సినిమాల్లో అతిథి పాత్రలు పోషించిన మహేష్‌.. ఈ సారి మహేష్‌ సినిమాలో కృష్ణ అతిథి పాత్రలో కన్పించడం విశేషం.

కృష్ణ నుంచి ఓ విమర్శ

కృష్ణ నుంచి ఓ విమర్శ

నాని సినిమాను చూసిన కృష్ణ.. ‘ఈ సినిమా ఆడితే మహేష్‌ స్టార్‌ కాదు. ఈ సినిమా ఫ్లాప్‌ అయితే మహేష్‌ స్టార్‌' అనేశారట. ఆయన చెప్పిన జోస్యం నిజమైంది. మహేష్‌ చేసిన ‘నాని' ప్రయోగం వికటించింది.

గారం..

గారం..

మహేష్‌ సినిమా షూటింగ్‌ అయిపోగానే ఇంటికి వచ్చి ‘సితార'తో ఆడుకుంటారట. వారానికి ఒకసారైనా వాళ్ల నానమ్మ దగ్గరికి వెళ్లాల్సిందే.

కొడుకు మెచ్చుకున్నాడు

కొడుకు మెచ్చుకున్నాడు

‘శ్రీమంతుడు' చూసి ‘చాలా బాగుంది నాన్నా రియలిస్టిక్‌గా ఉంది' అని మహేష్ బాబు కుమారుడు గౌతమ్ కితాబిచ్చాడట.

English summary
Mahesh Babu, born on August 9,1975, turns a year older today. We wish the 40-year-old actor the best on his birthday.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu