»   » గుజరాత్ డిప్యూటీ సీయెం : మహేష్ బాబుని కలిసిన కారణం ఏమిటో

గుజరాత్ డిప్యూటీ సీయెం : మహేష్ బాబుని కలిసిన కారణం ఏమిటో

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా మహేష్‌బాబుకు అభిమానులున్నారు. అయితే భాషతో సంబంధం లేకుండా మహేష్‌ను అభిమానించే వారున్నారని నిరూపించే సంఘటన ఇది. మురుగదాస్ దర్శకత్వంలో మహేష్‌బాబు నటిస్తున్న తాజా చిత్రం షూటింగ్ ఇటీవల గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగింది. ఈ షూటింగ్ జరుగుతున్న సమయంలో మహేష్ బాబును కలిసేందుకు గుజరాత్ డిప్యూటీ సీఎం నితిన్‌భాయ్ పటేల్ ఫ్యామిలీతో సహా రావడం విశేషం.

Superstar Mahesh Babu with Gujarat Deputy Chief Minster Nitinbhai patel

రావడమే కాదు మహేష్‌తో ఫోటోలు కూడా దిగారు. షూటింగ్ జరుగుతున్న తీరును దర్శకుడు మురుగదాస్‌ను అడిగి తెలుసుకున్నారు. గుజరాత్ డిప్యూటీ సీఎం నితిన్‌భాయ్ పటేల్ ఫ్యామిలీతో వ‌చ్చి మ‌హేష్ తో ముచ్చటించ‌డం విశేషంగా భావిస్తున్నారు. రావడమే కాకుండా మహేష్‌తో ఫోటోలు కూడా దిగ‌డం మ‌రో చిత్రంగా చెప్ప‌వ‌చ్చు. గుజరాత్‌లో కూడా మహేష్‌కు ఈ రేంజ్‌లో ఫాలోయింగ్ ఉండటంపై ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మ‌హేష్ స్టామినా అలాంటిది మ‌రి. గుజరాత్‌లో కూడా మహేష్‌కు ఈ రేంజ్‌లో ఫాలోయింగ్ ఉండటంపై ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

English summary
If common people is not enough to illustrate the stardom of Mahesh, Deputy Chief Minister of Gujarat, Nitinbhai Patel, himself landed on the sets in Ahmedabad to meet Mahesh. He was accompanied by his entire family.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu