»   »  సంక్రాంతికి వచ్చిన చిరు-బాలయ్య చిత్రాలపై మహేష్‌ కామెంట్

సంక్రాంతికి వచ్చిన చిరు-బాలయ్య చిత్రాలపై మహేష్‌ కామెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: సంక్రాంతి సందర్భంగా స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణలు వెండితెరపై సందడి చేశారు. చిరు తన 150వ చిత్రంగా 'ఖైదీ నంబర్‌ 150'తో వస్తే.. బాలకృష్ణ తన 100వ చిత్రంగా 'గౌతమిపుత్ర శాతకర్ణి'తో అభిమానులను పలకరించారు. రెండు చిత్రాలూ టాలీవుడ్ బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసి అసలైన పండుగ మజాను అన్నట్లు ఆనందపరిచాయి.. ఈ నేపథ్యంలో సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు ఇరువురు ఈ హీరోలిద్దరకూ శుభాకాంక్షలు తెలిపారు.

''చిరంజీవి నటనా సౌరభం మంత్రముగ్ధులను చేసింది. అన్నింటికీ మించి ఆయన అత్యున్నత స్థాయిలో ఉన్నారు. సర్‌.. ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని చాలా మిస్‌ అయ్యాం. వెల్‌కమ్‌ బ్యాక్‌, 'ఖైదీ నంబర్‌ 150' చిత్ర బృందానికి అభినందనలు'' అని ట్వీట్‌ చేశారు.

ఇక బాలకృష్ణ నటించిన చిత్రం గురించి మాట్లాడుతూ.. ''హ్యాట్సాఫ్‌ నందమూరి బాలకృష్ణ. 'గౌతమిపుత్ర శాతకర్ణి' గురించి వర్ణించాలంటే తెలుగు చిత్ర పరిశ్రమలో ఇదోక అత్యుత్తమ ప్రదర్శన. చిత్ర బృందం దృఢవిశ్వాసాన్ని, విజన్‌ను చూస్తే గర్వంగా అనిపిస్తోంది.

Superstar Mahesh shares excitement of Sankranti Releases

అందరికీ అభినందనలు. అందరికీ మరోసారి సంక్రాంతి శుభాకాంక్షలు' అని మరో ట్వీట్‌ చేశారు. మహేష్ బాబు ఒక మామూలు సినీ అభిమానిలాగే ఇద్దరు స్టార్ హీరోల్ని అభినందిస్తూ ట్వీట్స్ చేయడంతో ఈముగ్గురి స్టార్ హీరోల ఫ్యాన్స్ మహేష్ ను అభినందనలతో ముంచెత్తుతున్నారు.

మహేష్‌బాబు ప్రస్తుతం ఏఆర్‌ మురగదాస్‌ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మురగదాస్ దర్శకత్వంలో మహేష్ హీరోగా రూపొందుతున్న సినిమాకు సంబంధించి మీడియా, అభిమానుల సర్కిల్ లో ఎప్పుడూ ఆసక్తికరమైన చర్చ సాగుతూ ఉంటుంది.

ఈ సినిమాకు ఇంకా అఫీషియల్ టైటిల్ ఖరారు కానప్పటికీ రకరకాల టైటిల్ ఇప్పటి వరకు ప్రచారంలోకి వచ్చాయి. ఈ మూవీకి వాస్కోడిగామా, ఎనిమీ, అభిమ‌న్యుడు ఇలా కొన్ని టైటిల్స్ ప్ర‌చారంలో ఉన్నాయి. ఆ మధ్యన 'ఏజెంట్ శివ' అనే టైటిల్ తెరపైకి వచ్చింది. మరో ప్రక్క ఈ సినిమాకి 'సంభవామి' అనే పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. 'సంభవామి' ఫ్యాన్ మేడ్ పోస్టర్లు కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

English summary
Super Star Mahesh Babu showered praises on both Khaidi No 150 and Gautami Putra Satakarni.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu