twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గ్యాంగ్‌స్టర్‌గా రజనీ.. బాక్సాఫీస్‌ బద్దలు.. రికార్డుల మోత!

    By Rajababu
    |

    Recommended Video

    Rajini's Movies As Gangster Character

    సూపర్‌స్టార్ రజనీకాంత్ కాలా చిత్రం కోసం మరోసారి గ్యాంగ్‌స్టర్ అవతారం ఎత్తారు. పా రంజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 7వ తేదీన రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. కబాలి తర్వాత రజనీకాంత్‌తో పా రంజిత్ వరుసగా మరో సినిమాను రూపొందించడం గమనార్హం. ముంబైలోని మురికివాడ ధారవిలో నివసించే తమిళ వలస జీవుల హక్కుల కోసం పోరాడే పాత్రలో రజనీకాంత్ కనిపించనున్నారు. అయితే రజనీకాంత్‌ గ్యాంగ్‌స్టర్ చిత్రాల్లో కనిపించడం తొలిసారి కాదు. ఆ చిత్రాలు ఏమిటంటే..

     డాన్ రీమేక్‌గా బిల్లా

    డాన్ రీమేక్‌గా బిల్లా

    80వ దశంలో హిందీలో ఘన విజయం సాధించిన అమితాబ్ బచ్చన్ చిత్రాలను రీమేక్‌గా మలిచి రజనీకాంత్ నటించారు. అందులో భాగంగానే డాన్ (తెలుగులో యుగంధర్) చిత్రాన్ని తమిళంలో బిల్లాగా తెరకెక్కించారు. మాఫియా నాయకుడు ప్రమాదంలో చనిపోవడం, అలాగే ఉండే మరో పల్లెటూరి యువకుడు గ్యాంగ్‌స్టర్‌‌గా చెలామణి అవుతారు. ఆర్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రం దాదాపు 25 వారాలు నిర్విరామంగా ఆడింది.

    తమిళంలోకి ధర్మాత్ముడు రీమేక్

    తమిళంలోకి ధర్మాత్ముడు రీమేక్

    ఆ తర్వాత తెలుగులో ఘనవిజయం సాధించిన ధర్మాత్ముడు (కృష్ణంరాజు, జయసుధ) చిత్రాన్ని నల్లవనుకు నల్లావన్ చిత్రంగా తమిళంలో తెరకెక్కించారు. ఈ చిత్రంలో రజనీ మాణిక్యం అనే గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటించారు. ఆయన పత్నిగా రాధిక శరత్ కుమార్ కనిపించారు. ఈ చిత్రంలో మాణిక్యంగా రజనీ నటన ఇప్పటికీ అత్యుత్తమే. ఈ చిత్రం తమిళనాడులో 152 రోజుల పాటు ఆడింది. బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాసింది. రజనీకాంత్‌కు తొలి ఫిల్మ్‌ఫేర్ అవార్డును సంపాదించి పెట్టింది.

     దుమ్మురేపిన రంగా మూవీ

    దుమ్మురేపిన రంగా మూవీ

    1982లో ఆర్ త్యాగరాజన్ రూపొందించిన రంగా చిత్రంలో మరోసారి రజనీకాంత్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించారు. చిన్నతనంలో తప్పిపోయిన చెల్లెలు కోసం ఆవేదన చెందుతూ వెతికే పాత్రలో రజనీ నటన అద్భుతంగా చెప్పుకొంటారు. కేఆర్ విజయ ఆయన సోదరిగా నటించారు. రాధిక శరత్ కుమార్ జంటగా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లపరంగా దుమ్మురేపింది.

    భాషా ప్రభంజనం

    భాషా ప్రభంజనం

    ఇక రజనీకాంత్ నటించిన భాషా చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ భాషా ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టే అనే డైలాగ్‌తో తమిళ చిత్ర పరిశ్రమ రికార్డులను తిరగరాశారు. 1995లో సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం కేవలం తమిళంలోనే కాదు.. దాదాపు అన్ని భాషల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్నది. అప్పట్లో తమిళ సినీ రంగంలో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా ఓ రికార్డును సాధించింది.

    కబాలి హల్‌చల్

    కబాలి హల్‌చల్

    2016లో కబాలి చిత్రంలో రజనీకాంత్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటించారు. పా రంజిత్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. నిప్పురా అంటూ వదిలిన ట్రైలర్ సంచలనం రేపింది. అయితే అనుకొన్నంతగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. కానీ రజనీకాంత్ నటన మరోసారి ప్రతిభ చర్చనీయాంశమైంది.

    కాలాతో మరోసారి గ్యాంగ్‌స్టర్‌గా

    కాలాతో మరోసారి గ్యాంగ్‌స్టర్‌గా

    కబాలి అంతగా విజయం సాధించనప్పటికీ.. కాలా చిత్రంతో పా రంజిత్‌కు మరోసారి అవకాశం ఇచ్చారు. ఈ చిత్రంలోనూ రజనీకాంత్ గ్యాంగ్‌స్టర్‌ పాత్రను పోషించారు. ట్రైలర్‌లో ఎమోషన్స్, యాక్షన్ మిళితమైన సన్నివేశాలు ప్రేక్షకుల్లో మరోసారి అంచనాలు పెంచాయి. అయితే కాలా చిత్రం ప్రేక్షకులను మెప్పిస్తుందా అనేది రిలీజ్ తర్వాత తెలుస్తుంది.

    English summary
    Rajinikanth's Kaala movie getting ready to release on June 7th. In this occassion, Kaala Audio function organised in Hyderabad on June 4th. Dhanush, Rajinikanth, Huma Quereshi were graced the function. Rajinikanth gives counter to Dhanush, which made comments about Thaliva. A Kerala-based company called Telious Technology seems to be aware of it. So it saved itself the trouble and declared a holiday for its employees on its own.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X