Don't Miss!
- Sports
అందుకే నా వికెట్ త్యాగం చేశా: వాషింగ్టన్ సుందర్
- Lifestyle
Vastu Tips: లక్ష్మీదేవి లాంటి చీపురు ఎప్పుడు కొనాలి, ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా?
- News
అటెన్షన్ అమరావతి: అందరి చూపూ అటు వైపే..!!
- Finance
household income: భారతీయ కుటుంబాలపై సర్వే.. ఆదాయం, పొదుపులు ఎంతో తెలుసా ?
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Automobiles
భారతీయ మార్కెట్లో Hero XOOM ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ప్రైస్, వేరియంట్స్ & కలర్ ఆప్సన్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
చైనా బాక్సాఫీస్‌పై 2.O మూవీ దండయాత్ర.. అమీర్, బాహుబలి రికార్డుపై గురి
సూపర్‌స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన 2.O మూవీ ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల జైత్రయాత్రను చేస్తున్నది. విడుదలైన ప్రతీచోటా భారీ కలెక్షన్లను సాధిస్తున్నది. ఇక 2.O మూవీ చైనా బాక్సాఫీస్‌పై తడాఖా చూపించేందుకు సిద్దమవుతున్నది. ఈ సినిమాను చైనాలో భారీగా రిలీజ్ చేసేందుకు లైకా ప్రొడక్షన్ ఏర్పాట్లు చేస్తున్నది. వివరాల్లోకి వెళితే..

10 వేల థియేటర్లు.. 56 వేల స్క్రీన్లు
చైనాలో 2.O మూవీని అత్యధిక థియేటర్లలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్రణాళికను సిద్దం చేసింది. చైనాలోకి డబ్బింగ్ చేస్తున్న ఈ సినిమాను 10 వేల థియేటర్లలో, 56 వేల స్క్రీన్లలో రిలీజ్ చేయనున్నారు. దాదాపు వీటిలో 47 వేలకుపైగా 3డీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నారు.

రిలీజ్‌కు ముందే రికార్డు
చైనాలో 2.O మూవీ ప్రభంజనానికి మే 2 తేదీని ఎంచుకొన్నారు. ఒకవేళ ఈ సినిమా చైనాలో రిలీజ్ అయితే అత్యధికంగా 3డీ వెర్షన్‌లో రిలీజైన ఓ విదేశీ చిత్రంగా రికార్డును సొంతం చేసుకొంటుంది అని లైకా ప్రొడక్షన్ ఓ ప్రకటనలో వెల్లడించింది.
వీక్ డేస్‌లోనూ అదరగొడుతున్న 2.0... 6వ రోజు వసూళ్లు ఎంతంటే?

చైనా ప్రభుత్వ అంక్షలతో
భారతీయ, విదేశీ చిత్రాలపై చైనా ప్రభుత్వం అంక్షలు విధించింది. స్థానిక సినిమాలకు ప్రోత్సాహాన్ని ఇచ్చేందుకు అనేక చర్యలు తీసుకొన్నది. ఆ క్రమంలోనే ఏటా 34 చిత్రాలకు మించి విదేశీ చిత్రాలను రిలీజ్ చేయవద్దని నిబంధనలను మార్చింది.

భారతీయ సినిమాల హవా
ఇటీవల కాలంలో చైనాలో భారతీయ సినిమాలు భారీగా విడుదలై అద్భుతమైన కలెక్షన్లను సాధించాయి. అమీర్ ఖాన్ రికార్డులతో బాక్సాఫీస్‌ను దున్నేశాడు. ఇటీవల కాలంలో దంగల్, సీక్రెట్ సూపర్‌స్టార్, భజరంగీ భాయ్‌జాన్, హిందీ మీడియం చిత్రాలు వందల కోట్లను ఆర్జించాయి.

రూ.400 కోట్లకుపైగా వసూళ్లు
ప్రస్తుతం 2.O మూవీ ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లను సాధిస్తున్నది. గత వారం రోజుల్లో రూ.400 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. సుమారు రూ.600 కోట్లతో రూపొందిన ఈ చిత్రం నవంబర్ 26న రిలీజ్ భారీ వసూళ్లను కలెక్ట్ చేస్తున్నది.