»   » వీరయ్య బిడ్డనిరా ఒక్కడినే ఉన్నా..దిల్లు ఉంటే గుంపుగా రండ్రా.. రజిని 'కాలా' టీజర్ అరుపులే!

వీరయ్య బిడ్డనిరా ఒక్కడినే ఉన్నా..దిల్లు ఉంటే గుంపుగా రండ్రా.. రజిని 'కాలా' టీజర్ అరుపులే!

Subscribe to Filmibeat Telugu
వీరయ్య బిడ్డనిరా ఒక్కడినే ఉన్నా..దిల్లు ఉంటే గుంపుగా రండ్రా.. రజిని 'కాలా' టీజర్ అరుపులే!

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం 2.0 మరియు కాలా చిత్రాల్లో నటిస్తున్నాడు. 2.0 చిత్ర విడుదల ఆలస్యం అయ్యే అవకాశం ఉండడంతో ఆయన అభిమానులని ఖుషి చేయడానికి కాలా చిత్రంతో త్వరలో అభిమానుల ముందుకు రాబోతున్నాడు. కాలా చిత్ర టీజర్ ని కొద్దిసేపటి క్రితమే విడుదల చేసారు. రజినీకాంత్ మార్క్ డైలాగులు, యాక్షన్ అంశాలతో అభిమానులకు టీజర్ పండగలా ఉంది.

ఫాన్స్ కు పండగే

నిమిషం 17 సెకండ్ల నిడివి కలిగిన కాలా టీజర్ రజినీకాంత్ అభిమానులు పండగా చేసుకునేలా ఉంది. అభిమానులకు కావలసిన అన్ని అంశాలని దర్శకుడు పా రంజిత్ ఇందులో జోడించాడు.

ఈ వయసులో కూడా

ఈ వయసులో కూడా

రజినీకాంత్ వయసు పెరిగే కొద్దీ అయన డైలాగుల్లో పదును పెరుగుతోంది. వీరయ్య బిడ్డనిరా ఒక్కడినే ఉన్నా..దిల్లు ఉంటే గుంపుగా రండ్ర, మీరు ఇంకా నా పూర్తి రౌడీయిజాన్ని చూడలేదు.. చూస్తారు అంటూ రజిని చెబుతున్న డైలాగులు అదిరిపోతున్నాయి.


ప్రతినాయకుడు అతడే

ప్రతినాయకుడు అతడే

ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో ప్రముఖ నటుడు నానా పటేకర్ నటిస్తున్నారు. నానా పటేకర్ ఈ చిత్రంలో రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు.


 డాన్ పాత్రలో రజిని

డాన్ పాత్రలో రజిని

రజినీకాంత్ ఈ చిత్రంలో కరికాలన్ అనే డాన్ పాత్రలో కనిపించబోతున్నాడు. గడ్డం, నలుపు దుస్తులలో రజిని వేషధారణ ఆకట్టుకునే విధంగా ఉంది.


రజిని అల్లుడే

రజిని అల్లుడే

ఈ చిత్రానికి రజినీకాంత్ అల్లుడు ధనుష్ నిర్మాత కావడం విశేషం. కాలా చిత్రీకరణ ఎక్కువగా ముంబైలో జరిగింది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ లో విడుదల చేయడానికి సన్నాహకాలు జరుగుతున్నాయి.


English summary
SuperStar Rajinikanth's Kaala teaser released. Rajinikanth mark dialogues are sounding well.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu