Just In
Don't Miss!
- News
Red Fort ముట్టడి: ఎర్రకోటపై ఎగిరిన జెండా: అయిదంచెల భద్రత తుత్తునీయలు
- Sports
ఆసీస్ ఆటగాళ్లతో మమ్మల్ని లిఫ్ట్ కూడా ఎక్కనీయలేదు: అశ్విన్
- Finance
ఒక్కరోజు రూ.5.2 బిలియన్ డాలర్లు నష్టపోయిన ముఖేష్ అంబానీ
- Automobiles
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 50,000 మంది క్యూలో ఉన్నారు..
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అసలే తమిళ రాజకీయాలు...అందుకే రజనీకాంత్‌కి భయం!
చెన్నై: తమిళనాడులో రాజకీయాలు ఏ రేంజిలో ఉంటాయో అందరికీ తెలిసిందే. అదో బురద లాంటిదే. అందుకే రజనీకాంత్ ఈ బురదలో దిగడానికి మొదటి నుండీ ఇష్ట పడటం లేదు. రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘కబాలి'. ఈ సినిమా వాస్తవానికి ఏప్రిల్ లో విడుదల కావాల్సి ఉన్నా తమిళనాడులో అప్పుడు ఎన్నికలు జరిగే అవకాశం ఉండటం....ఈ సినిమా విడుదలకు బ్రేక్ పడే అవకాశం ఉందని అంటున్నారు.
ఎన్నికల తేదీపై క్లారిటీ వచ్చేవరకు వేచి చూసి అప్పుడు రిలీజ్ డేట్ అనౌన్స్ చేయాలని భావిస్తున్నారట. దీంతో కబాలి సినిమా రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇకపోతే కబాలి టీజర్ ఈ నెల 24న విడుదల కానుంది. సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తమిళ చిత్రం 'కబాలి'. ఈ చిత్రాన్ని తెలుగులో కూడా అదే పేరుతో విడుద చేస్తున్నారు.

ఇందులో రాధికాఆప్టే హీరోయిన్ గా నటిస్తోంది. దన్షిక, రిత్వికా, దినేష్, కలైయరశన్, కిశోర్‌లతోపాటు పలువురు కొత్త నటులు నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి అన్ని పనులు, నటీనటుల ఎంపికను దర్శకుడు రంజితకే వదిలేయడంతో.. రజనీతో ఇదివరకు చేయనని నటులు పలువురు ఇందులో కనిపించనున్నారు.
ఈ చిత్రంలో విలన్ గా చైనీస్ స్టార్ జెట్ లీని ఎంపిక చేసారంటూ గత రెండు రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో చిత్రం టీమ్ క్లారిటీ ఇచ్చింది. మీడియాతో చిత్రం టీమ్ మాట్లాడుతూ.. " ఇది కేవలం రూమర్ మాత్రమే. అసలు మేము ఓ ఇంటర్నేషనల్ స్టార్ ని మా సినిమాలోకి తీసుకోవాలని అనుకోలేదు. ముఖ్యంగా జెట్ లీని అసలు ఊహించలేదు. ఇదంతా కేవలం కల్పన ," అని తేల్చి చెప్పారు. రజనీకాంత్ ఈ చిత్రంలో మాఫియా లీడర్‌గా కనిపిస్తారు. ఆయనకి భార్యగా రాధికా ఆప్టే నటిస్తున్నారు. ఈ చిత్రం కోసం రజనీ తెల్లటి గెడ్డంతో ప్రత్యేకమైన లుక్‌తో కనిపిస్తున్నారు.