»   » మొదలైన కబాలి సునామీ... గంటలో పదిలక్షల వ్యూస్

మొదలైన కబాలి సునామీ... గంటలో పదిలక్షల వ్యూస్

Posted By:
Subscribe to Filmibeat Telugu

రజినీ కాంత్ ఈ ఒక్క పేరుకున్న స్టామినా ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమా హిట్టయినా ఫ్లాపైనా రజినీకి సంబందం ఉండదు రజినీ ఎప్పుడూ సూపర్ హిట్టే.. రజినీ సత్తా ఏమిటో మరో సారి నిరూపితమైంది. ఒకే ఒక్క గంట లో పదిలక్షలమంది చూసేసారు. క‌బాలి దా అంటూ ర‌జ‌నీ చేస్తున్న సంద‌డి సోష‌ల్ నెట్‌వ‌ర్కింగ్ సైట్ల‌లో హోరెత్తిపోతోంది.....

'కబాలి' టీజర్ని . ఈ రోజు (మే ఒకటి ఆదివారం) ఉదయం 11 గంటలకు టీజర్‌ విడుదల చేసారు నిర్మాత కలై పులి ధాను. టీజర్ నెట్లోకి వచ్చిన కొన్ని సెకెండ్లలోనే విపరీతంగా వైరల్ అయ్యింది. ఒక్కోసంవత్సరమూ తన వయస్సు పెరిగే కొద్దీ రజినీ నటనలో స్టామినా తగ్గలేదని, తన స్టైల్‌లో ఏమాత్రం మార్పులేదు.

 Superstar Rajinikanth’s ‘Kabali’ Teaser goes viral; Records 1 MILLION views in just 1 hour!

అదే స్టైలిష్ లుక్ అదే దమ్ముతో వచ్చిన రజినీ కాంత్ టీజర్ తోనే సినిమా ఏ రేంజ్ లో ఉండబోతూందో ఒక శాంపిల్ చూపించాడు.. రజనీ స్టైల్ ఆయన పర్‌ఫార్మెన్స్ అభిమానుల మతులు పోగొడుతుంది. సంతోష్ నారాయణ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అద్బుతంగా ఉందంటూ కామెంట్స్ వినబడుతున్నాయి.

ప్రముఖ దర్శకుడు శంకర్‌ తో '2.ఓ(రోబో-2)లో నటించేందుకు కాస్తా విరామం తీసుకున్న ఆయన మళ్లీ 'కబాలి' టీమ్‌ తో జాయిన్‌ అయ్యాడు. ఇప్పుడు చెన్నైలోని ప్రఖ్యాత ప్రివ్యూ థియేటర్‌ లే మ్యాజిక్‌ లాంతర్న్‌లో ఆయన 'కబాలి'కి డబ్బింగ్ చెప్తున్నారు.

English summary
The much-awaited kabali teaser was released at 11 am sharp on the occasion of May Day and was lapped up by the audience in seconds …
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu