‘సొసైటీ’ కోసం షారుక్ భార్య గౌరీ హాట్ ఫోజులు...
హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్....‘సొసైటీ' అనే మేగజైన్ మార్చి నెల సంచిక కోసం ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. 40 ఏళ్ల వయసులోనూ గౌరీ ఖాన్ హాట్ లుక్ తో వెలిగి పోయింది. కేవలం షారుక్ భార్యగా కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది గౌరీ.
ఇంటీరియల్ డిజైనర్‌గా ఓ కంపెనీ రన్ చేస్తోంది. దీంతో పాటు ఫ్యాషన్ డిజైనింగులోనూ తన సత్తా చాటుతోంది. గౌరీ ఎక్కువ సమయం తన పిల్లలను భవిష్యత్ బాలీవుడ్ స్టార్లుగా తీర్చి దిద్దడానికి కేటాయిస్తుందని అంతా అనుకుంటారు. కానీ అదినిజం కాదు. మీ పిల్లలు ఎప్పటికైనా బాలీవుడ్ రంగంలోకి అడుగు పెడతారా అనే ప్రశ్నకు ఆమె స్పందిస్తూ...‘మా ఫ్యామిలీలో ఒక యాక్టర్ చాలు' అని సమాధానం ఇచ్చారు.

బాలీవుడ్ ఆదర్శ దంపతుల్లో ముందుగా చెప్పుకోవాల్సిన పేర్లు షారుక్ ఖాన్-గౌరీ. గౌరిని ప్రేమ వివాహం చేసుకున్నాడు షారుక్. అక్టోబర్ 25, 1991న ఢిల్లీలో వీరి వివాహం జరిగింది. షారుక్ 19 ఏళ్ల వయసులోనే గౌరీని తొలి సారి తొలి చూపులోనే ప్రేమలో పడ్డాడట. అప్పుడు ఆమె వయసు కేవలం 14 సంవత్సరాలే.


Click it and Unblock the Notifications











