»   » సెట్స్ పై గాయపడ్డ సూపర్ స్టార్

సెట్స్ పై గాయపడ్డ సూపర్ స్టార్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్‌ ఖాన్‌ హీరోగా రూపొందుతున్న చిత్రం 'ఫ్యాన్‌'. ఈ సినిమా చిత్రీకరణ గత కొన్ని రోజులుగా క్రొయోషియాలో జరుగుతోంది. ద్విచక్ర వాహనం మీద ఒక వ్యక్తి వెంబడిస్తుంటే షారుఖ్‌ పరిగెడుతున్న సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలో షారుఖ్‌ కాలు పట్టేయడంతో చాలా ఇబ్బంది పడ్డాడట. అయినా చిత్రీకరణ కొనసాగిస్తున్నాడు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

దీని గురించి షారుఖ్‌ ''కాలు పట్టేసింది. అయితే పెద్ద సమస్యేం లేదు. సూది మందుతో నొప్పిని తగ్గించుకుంటూ బాతులా నడుస్తున్నాను. నాకు బాతులంటే నచ్చవు... కానీ తప్పదు'' అంటూ ట్విట్టర్‌లో రాసుకొచ్చాడు. ఈ చిత్రంలో షారూఖ్ ఖాన్ సరసన ...వాణి కపూర్ (నాని..అహా కళ్యాణం హీరోయిన్) చేస్తోంది.

Superstar Shahrukh Khan injured on the sets

షారూఖ్‌ ఖాన్‌ ఇప్పటికే వరుస విజయాలతో దూకుడుమిదున్నాడు. ఇటీవల వచ్చిన 'హ్యాపీ న్యూ ఇయర్‌ మంచి విజయం సాధించింది. ఇది దాదాపు మూడు వందల కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టిందని ట్రేడ్‌ వర్గాలు అంటున్నాయి. అంతేకాదు.. ఈ శుక్రవారంతో తను నటించిన ప్రేమ కథా చిత్రం 'దిల్‌ వాలే దుల్హనియా లే జాయేంగే' సినిమా కూడా వెయ్యి వారాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తన ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్‌ చేశాడు షారూఖ్‌.

ప్రస్తుతం షారూఖ్‌ .. బ్యాండ్‌ బాజా బారత్‌, శుద్ద్‌ దేశీ రొమాన్స్‌' వంటి చిత్రాలను రూపొందించిన బాలీవుడ్‌ దర్శకుడు మనీష్‌ తివారి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. అయితే ఈ సినిమా పేరు 'ఫ్యాన్‌' అనేది ఓ విశేషమైతే.. ఈ చిత్రంలో షారూఖ్‌.. తన ఫ్యాన్‌గా తనే నటించడం మరో విశేషం. కాస్త వెరైటీ.. కాస్త ఆసక్తికరంగా.. మరికాస్త కొత్తగా ఉన్న ఈ కాన్సెప్ట్‌ నచ్చడంతో షారూఖ్‌ ఖాన్‌ కూడా వెంటనే ఓకే చెప్పాడని బాలీవుడ్‌ సమాచారం. మరి బాలీవుడ్‌లో ప్రయోగాత్మకమైన చిత్రాలను ఇష్టపడే షారూఖ్‌.. ఈ మూవీతో ఫ్యాన్‌గా తన ఫ్యాన్స్‌ను ఎంత వరకు ఎంటర్‌టైన్‌ చేస్తాడో చూడాలి.

English summary
Bollywood Superstar Shahrukh Khan suffered an injury while shooting for his upcoming flick 'Fan'. "Serious Ouch time! Hamstring shaken fortunately not stirred. Injections galore, running like a duck. Not that I don't like ducks but it sucks!," he reacts.
Please Wait while comments are loading...