»   » సాయి ధరమ్ తేజ్ ‘సుప్రీం’: నందమూరి హీరో కూడా(ఫోటోస్)

సాయి ధరమ్ తేజ్ ‘సుప్రీం’: నందమూరి హీరో కూడా(ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సాయి ధరమ్ తేజ్, రాశి ఖన్నా హీరో హీరోయిన్లుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నూతన చిత్రం ‘సుప్రీమ్' బుధవారం ఉదయం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు.

సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు. ఈ కార్యక్రమానికి నందమూరి కళ్యాణ్ రామ్ కూడా హాజరయ్యారు. కెమెరా స్విచాన్ చేసారు. హరీష్ శంకర్ గౌరవ దర్శకత్వం వహించారు. మరో దర్శకుడు గోపీచంద్ మలినేని చేతుల మీదుగా అనిల్ రావిపూడి స్క్రిప్టు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో సాయి ధరమ్ తేజ్ తల్లిదండ్రులు కూడా పాల్గొనటం గమనార్హం.

ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ...పటాస్ సినిమా సమయంలో అనిల్ రావిపూడితో పరిచయం ఏర్పడింది. ఆయన చెప్పిన లైన్ బాగా నచ్చింది. సాయి ధరమ్ తేజ్ కు కూడా బాగా నచ్చిందని తెలిపారు. ఒకప్పుడు చిరంజీవి గారిని సుప్రీం అనేవారు. ఇపుడు అదే టైటిల్ తో సాయి ధరమ్ తేజ్ సినిమా చేయడం ఆనందంగా ఉంది అన్నారు.

అలాగే తమ బేనర్లో సాయి ధరమ్ తేజ్ నటించిన ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' చిత్రం ఈ నెల 24న విడుదలవుతోందని, సినిమా సూపర్ హిట్టవుతుందని తెలిపారు. పవన్ కళ్యాణ్ కి మూడో సినిమా ‘సుస్వాగతం' స్టార్ ఇమేజ్ తెచ్చింది. ప్రభాస్ కి మూడో సినిమా ‘వర్షం' సినిమా పెద్ద హిట్టియింది. అదే విధంగా సాయి ధరమ్ తేజ్ కి మూడో సినిమా ‘సుబ్రహ్మణ్యం' ఫర్ సేల్ సూపర్ హిట్ అవుతుంది అన్నారు.

షూటింగ్

షూటింగ్

దర్శకుడు మాట్లాడుతూ...‘సుప్రీం' మూవీ యాక్షన్ ఎంటర్టెనర్ గా ఉంటూ ప్రేక్షకులు మంచి ఫీల్ ఇస్తుంది. అక్టోబర్ 5 నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టి నవంబర్ 15 వరకు ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేస్తాం. సెకండ్ షెడ్యూల్ డిసెంబర్-జనవరి నెలల్లో పూర్తి చేస్తామన్నారు.

విడుదల ఎప్పుడు?

విడుదల ఎప్పుడు?

ఫిబ్రవరిలో పాటల చిత్రీకరణ పూర్తి చేసి మార్చి చివర్లో లేదా ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో సినిమాను విడుదల చేస్తామన్నారు. ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ క్యాబ్ డ్రైవర్ గా నటిస్తున్నట్లు తెలిపారు.

నటీనటులు

నటీనటులు

ఈ చిత్రంలో సాయి కుమార్, పోసాని కృష్ణ మురళి, శ్రీనివాస్ రెడ్డి, జయప్రకాష్ రెడ్డి, కబీర్ సింగ్ తదితరులు ఇతర తారాగణం.

తెర వెనక

తెర వెనక

ఈ చిత్రానికి సంగీతం: సాయి ప్రకాష్, సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్, ఎడిటర్: ఎం.ఆర్.వర్మ, ఆర్ట్ డైరెక్టర్: ఎ.యస్.ప్రకాష్, ఫైట్స్: వెంకట్, రచనా సహకారం: ఎస్.కృష్ణ, నిర్మాత: దిల్ రాజు, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: అనిల్ రావిపూడి.

English summary
Photos of Supreme Movie Launch event held at Hyderabad. Sai Dharam Teja, Kalyan Ram, Dil Raju, Allu Aravind and others graced the event.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu