»   »  జియా ఖాన్‌ ఆత్మహత్య: కేసు డిఫెన్స్ వాదన ఇదీ

జియా ఖాన్‌ ఆత్మహత్య: కేసు డిఫెన్స్ వాదన ఇదీ

Posted By:
Subscribe to Filmibeat Telugu
Jiah Khan
ముంబయి : నటి జియా ఖాన్‌ ఆత్మహత్య కేసులో అరెస్టయిన సూరజ్‌ పాంచోలీ బెయిల్‌ పిటిషన్‌ విచారణను సెషన్‌ కోర్టు ఈనెల 21కి వాయిదా వేసింది. జియా ఖాన్‌ తల్లి పోలీసులకు అందించిన లేఖ సూసైడ్‌ నోటు కాదని సూరజ్‌ తరఫు న్యాయవాది వాదించారు. అందులో సూరజ్‌ పేరును మృతురాలు ప్రస్తావించలేదని, పైగా ఆమె సంతకం కూడా అందులో లేదని తెలిపారు.

డిఫెన్స్‌ న్యాయవాది వాదనను పోలీసులు సమర్థించారు. లేఖలో ఆమె జీవితంలోని విషాద జ్ఞాపికలు, నిరాశ వంటివి కనిపించాయని అధికారులు తెలిపారు. లేఖలో సూరజ్‌తో కలుసుకున్న కచ్చితమైన తేదీ, సమయం, ప్రదేశాన్ని పేర్కొనలేదు. జియా ఒక్కసారి కూడా సూరజ్‌కు వ్యతిరేకంగా పోలీసులకు ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదని పేర్కొన్నారు.

జియా తల్లి రబియా ఆ లేఖను దుర్వినియోగపరుస్తున్నారని, ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఆమె సూరజ్‌ జీవితం, కీర్తిని నాశనం చేయడమే లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. కేరీర్‌ కారణంగా జియా ఒత్తిడి ఎదుర్కొన్నారని, సూరజ్‌ ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించలేదన్నారు. మృతురాలికి మద్యం, నిద్రమాత్రలు తీసుకునే అలవాటుందని డిఫెన్స్‌ న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

మరోవైపు జియా, సూరజ్‌ల మధ్య సన్నిహిత సంబంధాలున్నాయని ఒక పోలీసు అధికారి తెలిపారు. జిమ్‌లో ఉన్నప్పుడు జియా తనను కలిసేందుకు, మాట్లాడటానికి ప్రయత్నించేదని సూరజ్‌ పోలీసులకు చెప్పారు. జుహూలోని జియా నివాసంలో సూరజ్‌ పంపిన గ్రీటింగ్‌ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో ఒకదానిపై సారీ అంటూ సంక్షిప్త సందేశం ఉంది. అయితే అతని క్షమాపణకు గల కారణాలను పోలీసులు పరిశోధిస్తున్నారు.

English summary

 Sooraj Pancholi said that Jiah’s mother, Rabia Khan, is seeking revenge. "Complainant (Rabia) is taking revenge for reasons best known to her," his bail application says. The application also alleges Rabia is misusing Jiah's letter which was found four days after her suicide at her house here on June 3.
 Suicide is a crime in the country and abetting suicide is punishable by up to 10 years in prison.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu