»   » ధృవ ఆ 20 నిమిషాల్లోనే అంతా .... చరణ్ వద్దని చెప్పినా సురేందర్ రెడ్డి కావాలనే అలా

ధృవ ఆ 20 నిమిషాల్లోనే అంతా .... చరణ్ వద్దని చెప్పినా సురేందర్ రెడ్డి కావాలనే అలా

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా 'ధృవ' పేరుతో ఓ యాక్షన్ థ్రిల్లర్‍ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా కొద్దినెలలుగా నిరంతరాయంగా షూటింగ్ జరుపుకుంటూ వస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ సన్నివేశాలను హైద్రాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరిస్తున్నారు. రామ్ చరణ్‌తో పాటు విలన్ అరవింద్ స్వామి పాల్గొంటూండగా ఈ సన్నివేశాల చిత్రీకరణ పకడ్బందీగా పూర్తవుతోంది.

ఫొటోస్ : ధృవ ట్రైలర్ లాంచ్


డిసెంబ‌ర్ 2న రావాల్సిన ధృవ సినిమా పోస్ట్ పోన్ అయింది. వారం రోజులు ఆల‌స్యంగా డిసెంబ‌ర్ 9న వ‌స్తోంది ఈ సినిమా. దాంతో ఇంకా షూటింగ్ పూర్తి కాలేదేమో అందుకే లేట్ అవుతుంద‌నుకున్నారంతా. కానీ ఇప్పుడు స‌డ‌న్ షాక్ ఇచ్చాడు రామ్ చ‌ర‌ణ్. ఈ సినిమా విడుద‌ల‌కు 20 రోజుల ముందే సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుంది. యు/ఎ స‌ర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసి.. ఫ‌స్ట్ కాపీ కూడా రెడీ చేసి పెట్టుకున్నారు గీతాఆర్ట్స్ సంస్థ‌. కానీ బ‌య‌ట క‌రెన్సీ క‌ష్టాలు పూర్తిగా తీరిపోయిన త‌ర్వాతే ధృవ‌ను రంగంలోకి దించాల‌ని మెగా ప్లాన్ వేసాడు మెగా నిర్మాత అల్లు అర‌వింద్.


Surender Reddy Making Changes To Script Of Dhruva climax

ఇక సెన్సార్ విశేషాల విష‌యానికొస్తే.. త‌ని ఒరువ‌న్ పూర్తిగా సీరియ‌స్ మూవీ. దీనికి రీమేక్ గా తెర‌కెక్కిన ధృవ కూడా ఆల్ మోస్ట్ అలాగే ఉండ‌బోతుంద‌ని స‌మాచారం. అయితే ఫ‌స్టాఫ్ లో మాత్రం కామెడీకి ఎక్కువ‌గా ప్రాధాన్య‌త ఇచ్చాడు సురేంద‌ర్ రెడ్డి. ర‌కుల్, చ‌ర‌ణ్ మ‌ధ్య వ‌చ్చే రొమాంటిక్ స‌న్నివేశాలు.. చ‌ర‌ణ్, అర‌వింద్ స్వామి మ‌ధ్య వ‌చ్చే సీన్స్.. ఆక‌ట్టుకుంటాయంటున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఇక సెకండాఫ్ పూర్తిగా యాక్ష‌న్ కే ప‌రిమిత‌మైన‌ట్లు స‌మాచారం. క్లైమాక్స్ లో చిన్న మార్పులు చేసారని తెలుస్తోంది. మొత్తానికి ధృవ డిసెంబ‌ర్ 9న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఇక ఇప్పుడు సెన్సార్ కూడా పూర్తి కావ‌డంతో ప్ర‌శాంతంగా క‌నిపిస్తున్నాడు మెగా వార‌సుడు.


రీమేకే అయినా.. సురేందర్ రెడ్డి తనదైన స్టైలిష్ టచ్ ఇస్తూ సినిమాను తెరకెక్కించిన వైనం టీజర్.. ట్రైలర్లలో కనిపించింది. సినిమా ప్లాట్ విషయంలో మార్పులేమీ చేయకపోయినా.. తెలుగు ప్రేక్షకుల అభిరుచి మేరకు కొన్ని మార్పులు కూడా చేశాడట సురేందర్. స్క్రీన్ ప్లే మరింత గ్రిప్పింగ్ గా ఉండేలా తీర్చిదిద్దడమే కాక.. రామ్ చరణ్ ఇమేజ్.. అభిమానుల ఆకాంక్షల్ని దృష్టిలో ఉంచుకుని మార్పులు చేసినట్లు సమాచారం.


Surender Reddy Making Changes To Script Of Dhruva climax

అలాగే చివర్లో హీరో పాత్ర హైలైట్ అయ్యేలా చూశాడని.. చివరి 20 నిమిషాల్లో కొత్తగా ఒక ట్విస్టుతో మరింత రసవత్తరంగా తీర్చిదిద్దాడని యూనిట్ నుంచి సమాచారం వస్తోంది.తమిళ వెర్షన్ కంటే 'ధృవ'ను మరింత పకడ్బందీగా.. ఆకర్షణీయంగా తీర్చిదిద్దినట్లు చెబుతున్నారు. సినిమా విషయంలో ఒక పట్టాన సంతృప్తి చెందని నిర్మాత అల్లు అరవింద్.. 'ధృవ' విషయంలో చాలా హ్యాపీగా ఉన్నారట. ఆయన మాటల్లోనూ ఆ కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. మరి 'ధృవ' ఎలాంటి సంచలనాలకు తెరతీస్తుందో చూద్దాం.

English summary
According to sources Dhruva makers are changed the climax of the telugu version. It is learnt that director Surender Reddy is keen to play it to the galleries this time around and he is making necessary changes to suit the image of Ram Charan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu