చిరంజీవికే స్కెచ్ వేసాడే
చిరంజీవికే స్కెచ్ వేసాడే
చిరంజీవితో తదుపరి చిత్రం ఎవరు చేస్తారనే టాపిక్ మొదలైంది. బోయపాటి శ్రీను తో చిరంజీవి 151 వ చిత్రం చేసే అవకాసం ఉందని వినపడుతూంటే ఊహించని విధంగా సీన్ లోకి సురేంద్రరెడ్డి వచ్చారు. ఆయన కథ చిరంజీవి విని ఓకే చేసారని తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా సురేంద్ర రెడ్డి ఖరారు చేసి తెలిపారు.
ఈ శుక్రవారం విడుదలవుతోన్న ధృవ ప్రమోషన్స్‌లో పాల్గొన్న సురేందర్ రెడ్డి ఈ విషయాన్ని స్వయంగా తెలియజేసారు. దాంతో మీడియా లో ఈ వార్త హైలెట్ అయ్యింది. సురేంద్రరెడ్డి, చిరంజీవి కాంబినేషన్ లో వచ్చే సినిమా ఎలా ఉండబోతుందనే విషయం కూడా ఆయన చెప్పారు.
సురేంద్రరెడ్డి మాట్లాడుతూ... "చిరంజీవి గారితో సినిమాకు సంబంధించి డిస్కషన్స్ జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఈ సినిమా మొదలవుతుంది. 'కిక్' సినిమాలా ఓ యాక్షన్ కామెడీలో చిరంజీవిని చూడాలన్నది నా కోరిక. అలాంటి సినిమాయే ఆయనతో చేస్తా" అని అన్నారు. ఈ కాంబినేషన్ లో రెడీ అయ్యే చిత్రాన్ని గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించే అవకాసం ఉందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











