»   »  రామ్ చరణ్-సురేందర్ రెడ్డి కాంబినేషన్లో సినిమా

రామ్ చరణ్-సురేందర్ రెడ్డి కాంబినేషన్లో సినిమా

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ త్వరలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్‌తో 'రేస్ గుర్రం'చిత్రం చేస్తున్న సురేందర్ రెడ్డి చరణ్ కోసం ఓ స్టోరీ రెడీ చేసాడని, కాన్సెప్టు నచ్చడంతో రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఫిల్మ్ నగర్ టాక్. త్వరలో పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

రేస్ గుర్రం' చిత్రం షూటింగులో బిజీగా గడుపుతున్న సురేందర్ రెడ్డి దీని తర్వాత రామ్ చరణ్‌తో చేయబోయే చిత్రంపై పూర్తి దృష్టి పెట్టనున్నాడు. కమర్షియల్ ఎంటర్టెనర్‌గా ఈచిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్న ఆయన, రామ్ చరణ్ స్థాయి మరింత పెంచేలా పకడ్భంధీగా స్క్రిప్టు రెడీ చేయనున్నారట.

'అతనొక్కడే' చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయిన సురేందర్ రెడ్డి 'కిక్' చిత్రం భారీ విజయం సాధించడంతో స్టార్ దర్శకుల జాబితాలో చేరిపోయాడు. ఇప్పటి వరకు ఆయన జూ ఎన్టీఆర్‌తో 'అశోక్', 'ఊసరవెల్లి', మహేష్ బాబుతో 'అతిథి' చిత్రాలను తెరకెక్కించాడు.

'రేస్ గుర్రం' సినిమా విషయానికొస్తే...అల్లు అర్జున్, శృతి హాసన్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈచిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ క్యారెక్టర్‌ను సరికొత్త లుక్‌తో, సరికొత్త మేనరిజం, స్టైల్‌తో చూపింబోతున్నా దర్శకుడు సురేందర్ రెడ్డి. నల్లమలుపు శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈచిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.

English summary

 Mega power star Ramcharn ready to work with surender reddy direction. Presently surender reddy working with Allu arjun for Race gurram movie. Recently surender reddy prepared a story for Ramcharan. Ramcharan impressed very much after listened this story line.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu