twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ కొందరిలో ఒకడి కథే... 'రేసు గుర్రం'

    By Srikanya
    |

    హైదరాబాద్ : అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం 'రేసు గుర్రం'. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కలయికలో వస్తున్న తొలి సినిమా ఇదే. ఈ చిత్రంలో అల్లు అర్జున్ క్యారక్టరైజేషన్ చాలా విభిన్నంగా ఉండబోతోందని దర్శకుడు చెప్తున్నాడు. ఫన్,యాక్షన్ కలిపి మరో కిక్ లా రూపొందిస్తున్న ఈ చిత్రం పై మంచి అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం ఈ చిత్రం పతాక సన్నివేశాల షూటింగ్ జరుపుకుంటోంది. జడ్చర్ల పరిసరాల్లో ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ నేతృత్వంలో బన్నీ, బ్రహ్మానందం, విలన్ రవికిషన్, ఫైటర్స్‌పై ఈ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు సురేందర్‌రెడ్డి. అల్లు అర్జున్ క్యారక్టరైజేషన్ గురించి దర్సకుడు సురేంద్రరెడ్డి మీడియాతో మాట్లాడారు.

    సురేంద్రరెడ్డి మాట్లాడుతూ... "పరుగు పందెంలో గెలవడం రేసుగుర్రం విధి. జీవితమనే పరుగు పందెంలో గెలవడం మనిషి విధి. అయితే... ఈ రేసులో అడపాదడపా గెలిచేవారు కొందరైతే... గెలుపుని ఇంటిపేరుగా మార్చుకున్నవాళ్లు కొందరు. ఆ కొందరిలో ఒకడి కథే... 'రేసుగుర్రం. బాధ్యతాయుతమైన ఓ యువకుని కథాంశంతో సురేందర్‌రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ శక్తిమంతమైన పాత్ర పోషిస్తున్నారు" అన్నారు.

    అలాగే "గెలుపు కోసం బరిలో దిగినవాడికి... లక్ష్యం మాత్రమే కనిపించాలి. ఎదురొస్తున్న సవాళ్లు, పరిగెట్టిస్తున్న పరిస్థితులు, చుట్టుముడుతున్న సమస్యలూ ఇవేమీ పట్టించుకోకూడదు. రేసులో నిలవాలన్నా, నిలిచి గెలవాలన్నా పోరాడాల్సిందే. ఆ యువకుడూ అదే చేశాడు. 'రేసు గుర్రం'లా దూసుకుపోయాడు. మరి విజయం అందిందా? లేదా? ఇంతకీ ఈ రేసు దేని కోసం? తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే!" అన్నారు.

    కుటుంబ భావోద్వేగాల నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో బన్నీ పాత్ర చిత్రణ వైవిధ్యంగా ఉండనుందని, కథా కథనాల పరంగా సురేందర్‌రెడ్డి గత చిత్రాలను మించేలా ఈ సినిమా ఉంటుందని సమాచారం. శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో 'కిక్'శ్యామ్, సలోని ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నారు.

    సంక్రాంతికి 'రేసుగుర్రం'ను బరిలో దించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇద్దరమ్మాయిలతో... సినిమా బాక్సాఫీస్‌ వద్ద పరాజయం చెందిన తరువాత బన్ని చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాతో ఎలాగైనా హిట్‌ కొట్టాలని భావిస్తున్నాడు. అలాగే ఊసరవెల్లి సినిమా తరువాత సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇది. ఇతనికీ ఈ సినిమా విజయం ఎంతో అవసరం ఉంది. ఎందుకంటే ఊసరవెల్లి అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది.ఈ చిత్రంలో సలోని సెకండ్ హీరోయిన్‌గా కనిపించనుంది.

    కోట శ్రీనివాసరావు, సుహాసిని మణిరత్నం, ప్రకాష్‌రాజ్, అలీ, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు, ముఖేష్‌రుషి, ఆశిష్ విద్యార్థి, నవాజ్ సోనూ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రచన: వక్కంతం వంశీ, కెమెరా: మనోజ్ పరమహంస, సంగీతం: ఎస్.తమన్, కూర్పు: గౌతంరాజు, నిర్మాతలు: నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), డా.కె.వెంకటేశ్వరరావు, నిర్మాణం: శ్రీలక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్.

    English summary
    Race Gurram happens to be the next biggest outing of Allu Arjun after the release of his hit movie Iddarammayilatho. Surendar Reddy, who has earlier directed movies like Kick and Oosaravelli, is working with Bunny in this film. The director is leaving no stone unturned to make this project big in his career. Meanwhile, he has also kept most of the aspects of the film under wraps.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X