»   » సురేష్ బాబుకి ఆ కథ మీద అంత నమ్మకమా??? "మెంటల్ మదిలో" రైట్స్ తీసుకున్న స్టార్ ప్రొడ్యూసర్

సురేష్ బాబుకి ఆ కథ మీద అంత నమ్మకమా??? "మెంటల్ మదిలో" రైట్స్ తీసుకున్న స్టార్ ప్రొడ్యూసర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

యువ హీరో శ్రీవిష్ణు, 'పెళ్లి చూపులు' నిర్మాత రాజ్ కందుకూరి కాంబినేషన్ లో నిర్మిస్తున్న తాజా చిత్రం మెంటల్ మదిలో (మనవి ఆలకించరాదటే). ఈ మధ్యే విడుదలై సంచలనం క్రియేట్ చేసిన మల్టీ స్టారర్ అప్పట్లో ఒకడుండేవాడు. ఈ చిత్రంలో నారా రోహిత్ తో పాటు శ్రీ విష్ణు కీలక పాత్ర పోషించాడు.

అయితే విష్ణు ఇదివ‌ర‌కే ప్రేమ ఇష్క్ కాదల్, నల దమయంతి, సన్ ఆఫ్ సత్యమూర్తి, జయమ్ము నిశ్యయమ్మురా వంటి చిత్రాలలో కూడా నటించి మెప్పించాడు. అయితే ఇప్పుడు శ్రీ విష్ణు ప్రధాన పాత్రలో ఓ మూవీ తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ద్వారా 'నివేతా పేతురాజ్' కథానాయికగా తెలుగు వెండితెరకు పరిచయమవుతోంది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. మరీ ట్రెండింగ్ లో దూసుకు పోలేదు గానీ చూసిన వాళ్లని మాత్రం బాగానే ఆకట్టుకుంది.

Suresh Babu Acquires Mental Madhilo

రాజ్ కందుకూరి నిర్మించిన పెళ్లి చూపులు సినిమా రైట్స్ తీసుకున్న స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు, మెంటల్ మదిలో సినిమా రైట్స్ కూడా సొంతం చేసుకోవటం విశేషం. ఇటీవల చిత్రయూనిట్ తో కలిసి మెంటల్ మదిలో ఫస్ట్ కాపీ చూసిన సురేష్ బాబు వెంటనే ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులు తీసుకునేందుకు ఓకె చెప్పారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను రిలీజ్ డేట్ ను త్వరలో ప్రకటించనున్నారు.

English summary
Producer D.Suresh babu has just watched the first copy of Mental madhilo directed by debutant Vivek Athreya. and immediately acquired the theatrical and other rights.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu