»   » తెలుగు ఫిలిం ఛాంబర్‌ ఎన్నికలు: ఎలక్షన్ ఫొటోలు&ఫలితాలు

తెలుగు ఫిలిం ఛాంబర్‌ ఎన్నికలు: ఎలక్షన్ ఫొటోలు&ఫలితాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :ఆదివారం హైదరాబాద్‌లో తెలుగు ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. స్టూడియో సెక్టార్‌, ప్రొడ్యూసర్స్‌ సెక్టార్‌, ఎగ్జిబిటర్స్‌ సెక్టార్‌, డిస్ట్రిబ్యూటర్స్‌ సెక్టార్‌లకు చెందిన సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఎన్నిక ఫలితం

ఆదివారం రాత్రి ఎన్నికల ఫలితాల్ని విడుదల చేశారు. తెలుగు ఫిలిం ఛాంబర్‌ అధ్యక్షుడిగా ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు ఎన్నికయ్యారు. ఛాంబర్‌ ఉపాధ్యక్షులుగా వి.వెంకటరమణరెడ్డి (దిల్‌ రాజు), ఎం.రమేష్‌, పి.కిరణ్‌.. కార్యదర్శులుగా కె.ఎల్‌.దామోదర్‌ ప్రసాద్‌, కేవీవీ ప్రసాద్‌, సహాయ కార్యదర్శులుగా ఎన్నికయ్యారు.
అలాగే...ఏలూరు సురేందర్‌రెడ్డి, ఎ.రామదాసు, శ్రీనివాసబాబు, జి.మహేశ్వరరెడ్డి, కేఎన్‌వీఎస్‌ గురుమూర్తి, పి.సాంబశివారెడ్డి, కోశాధికారిగా కొడాలి వెంకటేశ్వరరావు ఎన్నికయ్యారు.

ఈ ఎన్నికలో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు ఎవరంటే... ఫిలిం ఛాంబర్‌ ఎన్నికల్లో పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిర్మాతలు డి.సురేష్‌బాబు, దిల్‌రాజు, కె.ఎస్‌.రామారావు, ఆదిశేషగిరిరావు, వర్మ, దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి, సాగర్‌, ఎమ్మెల్యే, నిర్మాత మాగంటి పినాథ్‌, సినీ నటులు కె.అశోక్‌కుమార్‌, వేణుమాదవ్‌, ఝాన్సీ తదితరులు ఓటు వేశారు.

ఎలక్షన్ జరిగినప్పటి ఫొటోలు... స్లైడ్ షో లో ..

విజయం

విజయం


ఈ ఎన్నికల్లో సురేష్ బాబు ప్యానెల్ విజయం సాధించింది

ఎన్నిక

ఎన్నిక


ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్ష్యులుగా సురేష్ బాబు ఎన్నికయ్యారు. ఆయనకు ఇండస్ట్రీలో అందరూ శుభాకాంక్షలు తెలియచేసారు

రెండేళ్లపాటు

రెండేళ్లపాటు


సురేష్ బాబు రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు.

ఎక్కడంటే

ఎక్కడంటే

ఈ ఎన్నికలు ఫిల్మ్ ఛాంబర్ హాల్ లో జరిగాయి

ఎవరెవరకీ మధ్య

ఎవరెవరకీ మధ్య


సురేష్ బాబు-దిల్ రాజు మరియు ప్రసన్నకుమార్-నట్టికుమార్ ప్యానెల్స్ మధ్య పోటీ

ఎగ్జిక్యుటివ్ మెంబర్స్

ఎగ్జిక్యుటివ్ మెంబర్స్

ఈ ఎన్నికల్లో ఎగ్జిక్యుటివ్ మెంబర్స్ 48 మంది ఎంపిక అయ్యారు

క్లీన్ స్వీప్

క్లీన్ స్వీప్


ఎగ్జిబిటర్స్ సెక్టార్ (16 ఇసి) నుంచి 16 ఇసి మెంబర్స్ ను సురేష్ బాబు ప్యానెల్ స్వీప్ చేసింది

రెండు ప్యానెల్స్

రెండు ప్యానెల్స్


స్టూడియో సెక్టార్ (4 ఇసి) నుంచి చెరో 2 ఇసిలను రెండు ప్యానెల్ లు గెలిచాయి

డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ లో

డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ లో


డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ (16 ఇసి)లో సురేష్ బాబు ప్యానెల్ 13 ఇసి మెంబర్స్ ను ప్రసన్నకుమార్ ప్యానెల్ 3 ఇసిలను గెలుపొందాయి.

ఇక..

ఇక..


నిర్మాతల సెక్టార్ (12 ఇసి) లో సురేష్ బాబు ప్యానెల్ కు 10, ప్రసన్న కుమార్ ప్యానెల్ కు 2 ఇసి మెంబర్స్ గెలుపొందారు.

మార్చారు

మార్చారు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో ఎ.పి. ఫిల్మ్ ఛాంబర్ పేరును ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గా మార్చారు.

తర్వాత తొలిగా

తర్వాత తొలిగా

ఈ మార్పు జరిగిన తర్వాత తొలిసారి ఛాంబర్ ఎన్నికలు వచ్చే ఆదివారం జరుగాయి.

విశేషం ఏమంటే...

విశేషం ఏమంటే...

ఛాంబర్ లోని ప్రధానమైన - ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, స్టూడియో ఈ నాలుగు సెక్టార్లలోనూ ఈసారి హోరాహోరీ పోరు జరుగుతుందని భావించారు. అయితే అటువంటి పరిస్ధితి ఏమీ కనపడలేదు.

ఓ వైపు

ఓ వైపు

ప్రముఖ నిర్మాత డి. సురేశ్ బాబు, సి. కళ్యాణ్, దిల్ రాజు తదితరులు ఓ వైపు ఉన్నారు.

దాసరి ఆశీస్సులతో...

దాసరి ఆశీస్సులతో...

ప్రసన్నకుమార్, నట్టికుమార్ మరోవైపు నిలిచి తమ సత్తా చాటేందుకు పథక రచన చేసారు.

చేతులు కలిపింది

చేతులు కలిపింది

సురేశ్ బాబు నేతృత్వంలోని ప్రోగ్రెసివ్ ప్యానెల్ నిర్మాతల మండలికి పోటీగా ఏర్పడిన నిర్మాతల సిండికేట్ తో చేతులు కలిపింది.

ఫలించాయి

ఫలించాయి

ఛాంబర్ లోనూ తమ ఆధిపత్యాన్ని చాటుకోవాలని ఈ వర్గం ప్రయత్నాలు చేసింది. అవి ఫలించాయి.

అయితే...

అయితే...

వీరికి ప్రసన్న కుమార్, నట్టికుమార్ తదితరులు 'మన ప్యానల్'తో చెక్ పెట్టాలని భావించారు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది.

ఇదే సురేష్ బాబు టీం చెప్పింది

ఇదే సురేష్ బాబు టీం చెప్పింది

'చేసినవే చెబుతాం, చెప్పినవే చేస్తాం' అని ప్రోగ్రెసివ్ ప్యానల్ తరఫున సి. కళ్యాణ్ అన్నారు

నట్టికుమార్ ఇలా..

నట్టికుమార్ ఇలా..


... థియేటర్ల మోనోపలీకి చరమ గీతం పాడే సమయం ఆసన్నమైందని, గుత్తాధిపత్యాన్ని ఈ ఎన్నికల్లో చెల్లు చీటీ పలుకుతామని నట్టికుమార్ చెప్పారు.

ఆసక్తిని...

ఆసక్తిని...

ఉమ్మడి రాష్ట్రం రెండుగా విడిపోయాక జరిగిన మొట్టమొదటి తెలుగు ఫిల్మ్‌చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఎన్నికలు సహజంగానే సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించాయి.

భావించారు

భావించారు

మునుపటి ‘ఆంధ్రప్రదేశ్‌' చాంబర్‌ను ‘తెలుగు' చాంబర్‌గా మార్చడంపై నిరసన వ్యక్తం చేసిన వాళ్లు సైతం ఈ ఎన్నికల్లో పోటీ చేయడాన్ని ప్రతిష్ఠాత్మకంగా భావించారు.

అందుకే ప్రాదాన్యత

అందుకే ప్రాదాన్యత

చిత్ర పరిశ్రమను శాసిస్తున్న ‘ఆ నలుగురి' ప్యానెల్‌ను ఓడించడమే ధ్యేయంగా చిన్న నిర్మాతల ప్యానెల్‌ పోటీ పడటం ఈ సారి ఎన్నికలకు ఎక్కడలేని ప్రాధాన్యాన్ని తెచ్చాయి.

స్పష్టమైన మెజారిటీ

స్పష్టమైన మెజారిటీ

చాంబర్‌కు చెందిన నాలుగు సెక్టార్లు.. ప్రొడ్యూసర్ల, డిసి్ట్రబ్యూటర్ల, ఎగ్జిబిటర్ల, స్టూడియో ఓనర్ల సెక్టార్ల ఎన్నికల్లో ప్రోగ్రెసివ్‌ ప్యానల్‌ స్పష్టమైన మెజారిటీ సాధించింది.

సరిపెట్టుకుంది

సరిపెట్టుకుంది

మొత్తం 48 మంది కార్యవర్గ సభ్యుల స్థానాలకు గాను ప్రోగ్రెసివ్‌ 41 స్థానాలు కైవసం చేసుకోగా, మన ప్యానల్‌ 7 స్థానాలతో సరిపెట్టుకుంది.

అనంతరం సురేష్ బాబు మాట్లాడుతూ...

అనంతరం సురేష్ బాబు మాట్లాడుతూ...

''తెలుగు చిత్ర పరిశ్రమ రూ.250 కోట్లతో సినిమా తీసే స్థాయికి ఎదిగింది. తెలుగు చిత్రాలు తమిళనాడుతో పాటు మిగతా రాష్ట్రాల్లో ఆడాలనేది నా కోరిక అన్నారు.

 సురేష్ బాబు కంటిన్యూ చేస్తూ...

సురేష్ బాబు కంటిన్యూ చేస్తూ...

చిత్ర పరిశ్రమలోని సమస్యల్ని మేమే పరిష్కరించుకుంటాం. ప్రతి చిన్న సమస్యను పెద్దగా చూడొద్దు. సెక్టార్స్‌లోని సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. అందరం వ్యాపారంలో ఉన్నాం కాబట్టి అవగాహనతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది''అన్నారు డి.సురేష్‌బాబు.

English summary
Daggubati Suresh Babu has been elected president of the Telugu Film Chamber of Commerce (TFCC), earlier known as the Andhra Pradesh Film Chamber of Commerce.
Please Wait while comments are loading...