For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎందుకంత యాగీ...బాబు సీరియస్

By Srikanya
|

హైదరాబాద్ : పరిశ్రమలో ఏం జరిగినా.. 'ఆ నాలుగు కుటుంబాలు' అంటుంటారు. మేమేమీ పరిశ్రమలో అన్యాయంగా డబ్బులు సంపాదించుకోలేదు. ఎక్కడో డబ్బులు తీసుకొని స్టూడియోలు కట్టుకోలేదు. మా పెద్దలు సినిమాలు తీసి సంపాదించిన డబ్బుతో స్టూడియోలు, పంపిణీ సంస్థలు ఏర్పాటు చేసుకున్నాం. థియేటర్ల సమస్య దేశవ్యాప్తంగా ఉంది. పెద్ద కంపెనీలు థియేటర్లను లీజుకు తీసుకొంటున్నాయి. ఆయా థియేటర్ల యాజమాన్యాలు కూడా అందుకు అంగీకరిస్తున్నాయి. దీంతో ఆ యాజమాన్యానికి నచ్చిన, డబ్బులొస్తాయనుకునే సినిమానే ఆడిస్తారు అంటూ సురేష్ బాబు చాలా సీరియస్ గా మాట్లాడారు. ప్రతీసారి తమ కుటుంబాలపై పడుతున్నారంటూ ఆయన మండిపడ్డారు.

ఆయన నిర్మాతగా 'దృశ్యం' సినిమా తెరకెక్కింది. వెంకటేష్‌ హీరోగా రూపొందిన ఈ చిత్రం ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా సురేష్‌బాబు మీడియాతో మాట్లాడారు.యాభై ఏళ్ల కృషి ఫలితంగానే తాము నేడున్న స్థాయికి చేరుకున్నామనీ, కష్టం, ప్రతిభతోటే ఎవరైనా ఎదుగుతారనీ, తాను న్యాయంగానే థియేటర్లను నడుపుతున్నానే కానీ, చట్ట విరుద్ధంగా ఏమీ చేయట్లేదనీ సురేశ్‌ ప్రొడక్షన్స్‌ అధినేత డి. సురేశ్‌బాబు చెప్పారు.

ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు, భారతదేశంలోనే మొత్తం థియేటర్లను నలుగురైదుగురే కంట్రోల్‌ చేయబోతున్నారు. ఒక కంపెనీ వాళ్లు ఈ ఏడాది 300 థియేటర్లను కొనాలని లక్ష్యంగా పెట్టుకొని కొనేయబోతున్నారు. ఇంటరెస్ట్‌ ఉన్నవాళ్లు వాటిని రన్‌ చేస్తుంటారు. రేపు నాకు ఆసక్తి లేకపోతే నా థియేటర్లను వేరే వాళ్లకు అమ్మేస్తాను అన్నారు.

Suresh Babu fire on Aa Naluguru concept

నేను వాస్తవానికి 'దృశ్యం'ను ఆగస్ట్‌ 14కు తీసుకు రావాలని అనుకున్నా. కానీ అదే టైమ్‌కు ఎన్టీఆర్‌ 'రభస', సూర్య 'అంజాన్‌' వస్తున్నాయి కాబట్టి, నా సినిమా ముందుగా రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడే తెస్తున్నా. అదే నేను ఆగస్ట్‌ 14కి తేవాలనుకుంటే నా సినిమా రెండు లేదా మూడో ఆప్షన్‌ అవుతుంది. ఎగ్జిబిటర్లు మొదట ఎన్టీఆర్‌ సినిమాకి ప్రిఫరెన్స్‌ ఇచ్చి, తర్వాత 'దృశ్యం'కు ఇస్తారు. అది నేను అండర్‌స్టాండ్‌ చేసుకోవాలి. నేను మొండిగా అప్పుడే తేవాలనుకుంటే ఎగ్జిబిటరే చెబుతాడు, అప్పుడు వద్దని. జూలై 11కి ఏ సినిమాలూ లేవు కాబట్టి తెస్తున్నా.

ఎగ్జిబిటర్‌కు అవసరాన్ని సృష్టించాకే సినిమా తేవాలి. మన సినిమాకు డిమాండ్‌ని సృష్టించాలి. సినిమా పూర్తవడంతోటే థియేటర్‌ దొరకాలంటే ఎలా దొరుకుతుంది? 'ఆ నలుగురి దగ్గర అవున్నాయి, ఈ ముగ్గురి దగ్గర ఇవున్నాయి' అంటే ఏం చేస్తాం? దానికి సమాధానం ఉండదు. నేనేదైనా చట్టవిరుద్ధంగా చేస్తుంటే అప్పుడడగవచ్చు. కాంపిటిషన్‌ కమీషన్‌లో ఇలా చేయకూడదనుంటే చేయను. చట్ట విరుద్ధంగా నేనేమీ చేయట్లేదే అని తేల్చి చెప్పారు.

English summary
When entire Film industry is burning hot on ‘Aa Naluguru,’ the four big names who are executing their monopoly on production, distribution and exhibition departments. Producer Suresh Babu said ...Aa Nalugu idea in indursty is not good. He is extremely thrilled that his forthcoming Telugu thriller "Drishyam" will mark 50 years of their production house.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more