twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎపి ఫిల్మ్ ఛాంబర్ ఎలక్షన్ ..ఫలితాలు

    By Srikanya
    |

    రాష్ట్ర చలనచిత్ర వాణిజ్య మండలికి ఆదివారంనాడు హైదరాబాద్‌లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా డి.సురేష్‌బాబు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. కాగా, ఉపాధ్యక్షులుగా దిల్‌రాజు, సునీల్‌నారంగ్, ఎస్‌వీవీ సుబ్రహ్మణ్యం, గౌరవ కార్యదర్శులుగా కె.అశోక్‌కుమార్, ఎం.రమేష్, కోశాధికారిగా 'స్రవంతి" రవికిషోర్ ఎంపికయ్యారు.

    అలాగే సంయుక్త కార్యదర్శులుగా వజ్జా శ్రీనివాసరావు, ఎం.రామదాసు, బి.వెంకటేశ్వరరావు, బి.సంజీవరావు, వి.వీరినాయుడు, పి.సాంబశివారెడ్డి విజేతలయ్యారు. చలన చిత్ర వాణిజ్య మండలిలోని నాలుగు విభాగాలైన ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, స్టూడియో ఓనర్స్ సెక్టార్లకు సంబంధించిన సభ్యులు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

    నూతన అధ్యక్షుడుగా ఎంపికైన సురేష్‌బాబు మాట్లాడుతూ- ''ప్రతిష్టాత్మకమైన ఈ పదవికి నన్ను ఎన్నుకోవడం ఆనందంగా ఉంది.దీన్ని బాధ్యతగా భావిస్తున్నాను. సమర్థవంతమైన టీమ్ నాకు లభించింది. వీరందరి ప్రోత్సాహంతో పరిశ్రమలో సమస్యల పరిష్కారానికి నా వంతుగా కృషి చేస్తాను"" అన్నారు.

    ప్రొడ్యూసర్స్ సెక్టార్ ఛైర్మన్‌గా నట్టికుమార్, స్టూడియో-ల్యాబ్ సెక్టార్ ఛైర్మన్‌గా పి.కిరణ్, డిస్ట్రిబ్యూటర్స్ సెక్టార్ ఛైర్మన్‌గా డి.విష్ణుమూర్తి, ఎగ్జిబిటర్స్ సెక్టార్ ఛైర్మన్‌గా వీసీ హరినాథరెడ్డి ఎంపికయ్యారు.సురేష్ బాబుకి,మిగతా కార్య వర్గానికి ధట్స్ తెలుగు శుభాకాంభలు అందచేస్తోంది.

    English summary
    Daggubati Suresh Babu will be the new president of the AP Film Chamber of Commerce for the year 2011-12. The post, which is filled by rotation, from various sectors every year, is reserved for the studio sector this year.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X