»   » ఇపుడు నిర్మాత సురేష్ బాబు కూడా...!

ఇపుడు నిర్మాత సురేష్ బాబు కూడా...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: డా. డి. రామానాయుడి వారసుడిగా నిర్మాతగా టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు సురేష్ బాబు. రామానాయుడు వారసుల్లో వెంకటేష్ నటనవైపు వెళితే....సురేష్ బాబు మాత్రం నిర్మాణ రంగం వైపు వచ్చారు. నటుడిగా వెంకటేష్, నిర్మాతగా సురేష్ బాబు సక్సెస్ అయ్యారు.

కాగా.... రామానాయుడు నిర్మాతగా కొనసాగుతూనే కొన్ని సినిమాల్లో నటుడిగా మెరిసారు. అయితే సురేష్ బాబు మాత్రం ఇప్పటి వరకు కెమెరా ముందుకు రాలేదు. ఎట్టకేలకు ఆయన నటుడిగా మారుతున్నట్లు సమాచారం.

ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు అజారుద్దీన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న 'అజహర్' చిత్రంలో సురేష్ బాబు నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టోనీ డిసౌజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అజారుద్దీన్ పాత్రను ఇమ్రాన్ హష్మీ చేస్తున్నాడు.

టోనీ డిసౌజా, సురేష్ బాబు మధ్య చాలా కాలంగా మంచి స్నేహం ఉంది. ఈ నేపథ్యంలో ఇందులో ఓ కీలక పాత్రకు సురేష్ బాబుని టోనీ అడినట్లె తెలుస్తోంది. ఆయన మాట కాదనలేక సురేష్ బాబు కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.

Suresh Babu Makes His Acting Debut

అజహర్ సినిమా వివరాల్లోకి వెళితే...
అజహరుద్దీన్ జీవితచరిత్ర ఆధారంగా ఏక్తాకపూర్ నిర్మిస్తున్న ‘అజహర్' సినిమా ఫస్ట్ లుక్, టీజర్ ఆ మధ్య విడుదలై మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఈ హైదరాబాదీ క్రికెటర్ జీవితంలోని ట్విస్ట్ లు, టర్నింగ్ పాయింట్ లు ఓ కమర్షియల్ మసాలా సినిమాకు కావాల్సిన కథావస్తువుగా సరిగ్గా సరిపోతుందని భావించిన బాలీవుడ్ నిర్మాతలు... ఎట్టకేలకు బయోపిక్ ను సెట్స్ మీదకు తీసుకువెళ్లడంతో సఫలమయ్యారు.

అజార్ క్రికెట్ టీమ్ కెప్టెన్ గా సాగించిన విజయ పరంపర దగ్గర నుంచి మ్యాచ్ ఫిక్సింగ్ స్కాండల్ లో అతని ప్రతిష్ఠ మసకబారడం, ముంబై మోడల్ సంగీతా బిజలానీతో అతడి అఫైర్, ఆపై వివాదాల నడుమ జరిగిన వారి వివాహం, అతడి రాజకీయ పయనం వరకూ అన్నీ అంశాలనూ కూలంకషంగా తెరకెక్కిస్తారట.... అజార్ సైతం ఈ సినిమాకు తగిన సహకారం అందిస్తున్నాడని చిత్ర బృందం వెల్లడించింది. మరి అజార్ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయబోతున్న ఇమ్రాన్ హష్మి... ప్రేక్షకులను ఏ రీతిన మెప్పిస్తాడో చూడాలి.

English summary
Daggubati Suresh Babu making his acting debut in Bollywood's "Azhar". Director Tony D'Souza asked him to star in a special role.
Please Wait while comments are loading...