»   » రామ్ గోపాల్ వర్మ రికార్డు బ్రద్దలు కొడదామని: డి.సురేష్ బాబు

రామ్ గోపాల్ వర్మ రికార్డు బ్రద్దలు కొడదామని: డి.సురేష్ బాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఆరోజు షూటింగ్‌లో వెంకటేష్‌ ఒక ఇంటి తాళాన్ని పగలకొట్టే సీన్‌ ఉంది. ఆ సీన్‌ గుర్తుకురాగానే నేనొక సైకిల్‌చైన్‌ తెప్పించి గొళ్లానికి చుట్టించి వెంకటేష్‌ లాగగానే ఆ చైన్‌ వూడిపోయినట్టు షూట్‌ చేయించాను. ఎందుకు సార్‌ అని యూనిట్‌ వాళ్లు అడిగితే 'మనం శివ చిత్రంలోని సైకిల్‌చైన్‌ రికార్డుల్ని కూడా బ్రేక్‌ చేద్దామని' అన్నాను. ఇప్పుడు తల్చుకుంటే నాకే నవ్వొస్తుంది అలా ఆలోచించినందుకు అంటూ గతాన్ని గుర్తు చేసుకున్నారు డి.సురేష్ బాబు.ఆయన తన సోదరుడు వెంకటేష్ తో నిర్మించిన బొబ్బిలిరాజా చిత్రం గురించి మాట్లాడుతూ.అలాగే ...బొబ్బిలిరాజా షూటింగ్‌ మొదలైంది. బి.గోపాల్‌ని దర్శకుడుగా ప్రకటించాం.అప్పుడొక సినీ విలేఖరి నా దగ్గరికొచ్చి 'ఏంటిసార్‌, అందరూ కొత్తకొత్త దర్శకుల్ని పెట్టి పెద్దపెద్ద హిట్లు ఇస్తున్నారు.

మీరేంటి వెంకటేష్‌ సినిమాని ఇంకా బి.గోపాల్‌తో తీస్తున్నారు' అని అడిగాడు. ఎందుకంటే నాగార్జునకి 'శివ', రాజశేఖర్‌కి 'అంకుశం' లాంటి బ్లాక్‌బస్టర్‌ హిట్లు పడ్డ రోజులవి. అతని మాటలు వినగానే నాక్కొంచెం భయం వేసింది.దానికితోడు... మర్నాడే పేపర్‌లో ఒక ప్రకటన వచ్చింది. 'శివ' సినిమా సృష్టించిన రికార్డులతో మిగతా రికార్డులన్నీ చెత్తకుప్పలో పడిపోయినట్లుందా యాడ్‌.అందుకే ఆ సీన్ పెట్టాం అన్నారు.

English summary
Star Producer D.suresh Babu remembers his young days.He produced Bobbili Raja film with his brother Venkatesh.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu