»   » రివ్యూల కుండ బద్దలు కొట్టాడు: రజినీకాంత్ మాటలకు సురేష్ బాబు సూటి వ్యాఖ్యలు

రివ్యూల కుండ బద్దలు కొట్టాడు: రజినీకాంత్ మాటలకు సురేష్ బాబు సూటి వ్యాఖ్యలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినిమా రిలీజైన వెంటనే రివ్యూలు ఇవ్వడం వల్ల నిర్మాతలు నష్టాల పాలవుతున్నారని.. కాబట్టి ఫస్ట్ వీకెండ్ వరకు ఓపిక పట్టి సోమవారం నుంచి రివ్యూలు రాయాలని.. పబ్లిష్ చేయాలని ఈ మధ్యే తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్.. విశాల్ కోరిన సంగతి తెలిసిందే. ఇదే మాటని గత కొంత కాలంగా టాలీవుడ్ లో డైరెక్టర్ తేజా, పూరీ జగన్నాథ్ లాంటి దర్శకులూ చెప్తూ వస్తున్నారు.

ఇప్పటికీ అర్థం కాని ప్రశ్నే

ఇప్పటికీ అర్థం కాని ప్రశ్నే

అయితే నిజంగా జనాలంతా రివ్యూవర్ల మాటలనే ఫాలో అవుతారనుకోవటం మాత్రం నిజమా కాదా అన్నది ఇప్పటికీ అర్థం కాని ప్రశ్నే... ఎందుకంటే సినిమా మొదటి షో తర్వాత వచ్చే టాక్ ని బట్టే సినిమా రిపోర్ట్ బయటకు వస్తుంది. ఒక సినిమా రివ్యూ అనేది ఖచ్చితంగా ప్రేక్షకుడి అభిప్రాయాన్ని మార్చటం అన్నది సరైంది కాదన్నదే చాలామంది అభిప్రాయం...

టాప్ రేటింగ్ వచ్చిన సినిమాలు కూడా

టాప్ రేటింగ్ వచ్చిన సినిమాలు కూడా

రివ్యూలు తేడాగా వచ్చినా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లే రాబట్టుకున్న సినిమాలూ ఉన్నాయి... టాప్ రేటింగ్ వచ్చిన సినిమాలు కూడా బోల్తా పడ్డ సంఘటనలూ ఉన్నాయి... అంతెందుకు పెయిడ్ రివ్యూ అన్న మాట టాలీవుడ్ కీ కొత్తేం కాదు.. అయినా సినిమాలు హిట్లూ ఫ్లాప్ లూ రివ్యూలకి సంభందం లేకుండానే సాగిపోతున్నాయి....

స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు

స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు

ఇదే మాటని స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు కూడా చెప్పేసారు సమీక్షకుల స్వేఛ్ఛకి, మీడియా స్వాతంత్య్రానికి ఎవరూ అడ్డు చెప్పరాదని అన్నారు. ఒక చెత్త సినిమాకి మంచి రివ్యూ ఇచ్చినంత మాత్రాన అది ఆడదని, అలాగే ఒక మంచి సినిమాకి నెగెటివ్‌ రివ్యూ వచ్చినా ఫలితం మారదని ఆయన చెప్పారు.

పాజిటివ్‌ రివ్యూలు

పాజిటివ్‌ రివ్యూలు

ఒక్కోసారి చిన్న చిత్రాలకి ముందుగా పాజిటివ్‌ రివ్యూలు రావడం వల్ల జరిగే మంచి ఏంటనేది పెళ్లిచూపులు, ఘాజీకి చూసామని, ప్రతి దానికీ రెండు సైడ్స్‌ వుంటాయని, అంచేత రివ్యూలని ఆపాలనుకోవడం సబబు కాదని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ మీడియా రివ్యూలు ఆపినా సోషల్‌ మీడియాలో వచ్చే ఒపీనియన్స్‌ని ఎలా ఆపగలరని.

మెరిట్స్‌కి అనుగుణంగా

మెరిట్స్‌కి అనుగుణంగా

అది ఎవరి చేతిలో లేదని, సినిమా రిలీజ్‌ అయిన తర్వాత దాని మెరిట్స్‌కి అనుగుణంగా ఆడుతుందే తప్ప దాని ఫలితాన్ని ప్రభావితం చేసే శక్తి దేనికీ లేదనేది తన అభిప్రాయమని ఆయన కుండ బద్దలు కొట్టారు. ఒక వేళ వెబ్ సైట్లు.. ఎలక్ట్రానిక్ మీడియా.. పత్రికల్లో రివ్యూల్ని ఆపగలిగినప్పటికీ..

ట్రెండు ప్రకారం వెళ్లిపోవాల్సిందే

ట్రెండు ప్రకారం వెళ్లిపోవాల్సిందే

సోషల్ మీడియాలో నెటిజన్లు ఇచ్చే సొంత రివ్యూల్ని.. వాళ్ల అభిప్రాయాల్ని ఎవ్వరూ ఆపలేరని.. కాబట్టి రివ్యూలను కొన్ని రోజులు ఆపడం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. మారిన ట్రెండు ప్రకారం వెళ్లిపోవాల్సిందే అని ఆయన అన్నారు. సురేష్ బాబు చాలా ప్రాక్టికల్ మాట్లాడారని చాలామంది అభిప్రాయపడుతున్నారు.

English summary
Even if the reviews are controlled, how can one put an axe on opinions expressed by netizens in social media?" questioned Suresh Babu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu