»   » సురేష్ కొండేటి చేతికి సిద్ధార్థ కొత్త చిత్రం..డిటేల్స్

సురేష్ కొండేటి చేతికి సిద్ధార్థ కొత్త చిత్రం..డిటేల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : వరసగా డబ్బింగ్ సినిమాలు అందిస్తూ టేస్ట్ ఉన్న నిర్మాతగా ఎదుగుతున్న సురేష్ కొండేటి మరో చిత్రం డబ్ చేస్తూ వార్తల్లోకి వచ్చారు. పిజ్జా సినిమాతో దర్శకునిగా తన ప్రతిభ నిరూపించుకున్న కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెలుగు తమిళ భాషల్లో రూపొందుతున్న జిగర్తతండా అనే సినిమాను ఎస్.కె. పిక్చర్స్, వియస్ఆర్ ప్రొడక్షన్స్ వారు సంయుక్తంగా ఈ సినిమాను తెలుగు వారికి అందిస్తున్నారు. సిద్ధార్థ్, లక్ష్మీ మీనన్ లు నటిస్తున్న ఈ సినిమా ఒక షెడ్యూల్ మినహా పూర్తయింది.

Suresh Kondeti bags Siddharth's new film

చిత్ర నిర్మాతల్లో ఒకరైన వి.ఎస్. రామిరెడ్డి మాట్లాడుతూ తెలుగు తమిళ భాషల్లో ప్రేక్షకులకు నచ్చే అద్భుతమైన కథాంశంతో సీ సినిమాను రూపొందిస్తున్నాము. సిద్ధార్థ్ పాత్ర అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుంది. ఓ ప్రముఖ తెలుగు హీరో ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించనున్నాడు. వేసవి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాము అని చెప్పారు.

సురేష్ కొండేటి మాట్లాడుతూతొలి చిత్రం పిజ్జా తో కార్తిక్ సుబ్బరాజు మంచి దర్శకునిగా నిరూపించుకున్నారు. మలి ప్రయత్నంగా ఓ వినూత్న కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నగర నేపధ్యంలో సాగే యాక్షన్ డ్రామా ఇది. యువతరాన్ని ఆకట్టుకునే కథ మా కాంబినేషన్ లో వచ్చిన పిజ్జా ఘనవిజం సాధించిన విషయం తెలిసిందే. సిద్ధార్థ్ సినిమాను చేయడం ఆనందంగా ఉంది వేసవి లో విడుదల కానున్న ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం ఉంది అన్నారు.

English summary
Tamil director Karthik Subbaraj who entered on film scene with stunning debut Pizza is now directing a film in Tamil with actor Siddharth in the lead. The film is now in the last leg of shoot. Suresh Kondeti is set to release the film in Telugu simultaneously with the Tamil version. V S Rami Reddy and Suresh Kondeti bought the movies rights. Lakshmi Menon is the heroine.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu