»   » మొత్తానికి కోరుకున్న వరుడితోనే అనుష్క పెళ్ళి అయిపోయింది....

మొత్తానికి కోరుకున్న వరుడితోనే అనుష్క పెళ్ళి అయిపోయింది....

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  అనుష్క పెళ్ళి అంటూ వార్తలు చాలా రోజులు గానే వినబడుతున్నాయి ఒక సారి ఎవరో నిర్మాత తో అనీ, ఇంకోసారి ఫారిన్ లో ఉన్న బిజినెస్ మాగ్నెట్ అనీ చెప్తూనే ఉన్నారు టాలీవుడ్, కోలీవుడ్ లో బిజీ బిజీగా సినిమాలు చేస్తున్న హీరోయిన్ ఎవ‌రంటే ఠ‌క్కున చెప్పే స‌మాధానం అనుష్క‌ సూర్యతో సింగం-3.. ప్రభాస్‌తో బాహుబలి-2.. అలాగే లేడీ ఓరియంటెడ్ మూవీ భాగమతి, నాగార్జున-రాఘవేంద్రరావులతో ఓం నమోవేంకటేశాయ. ఇప్పుడు అన్నీ సెట్స్ మీదే వున్నాయి.ఈ నాలుగు నెక్స్ట్ ఇయర్ సమ్మర్‌లోగా రిలీజ్ కాబోతున్నాయి.

  ఇప్ప‌టికే అనుష్క‌ వయసు 34 ఏళ్లని, ఇక లేట్ చేయకుండా మ్యారేజ్ చెయ్యాలని ఆమె కుటుంబ స‌భ్యులు ఫిక్స్ అయిపోయార‌ట‌. ఇప్పటికే అనుష్క పెళ్ళి మీద రకరకాల రూమర్లు వచ్చాయి. అయితే ఇప్పుడు తాజా గా పెళ్ళి జరిగిపోయిందనే న్యూస్ విన్న వాళ్ళు కాస్త కంగారు పడ్డా తర్వాత అసలు విషయం అర్థమయ్యాక మాత్రం ఊపిరి పీల్చుకున్నారట. ఇంతకీ విషయం ఏమిటంటే అనుష్క పెళ్ళీ అయ్యింది సింగం 3 సినిమాలో ...

  Suriya and Anushka to wed in Singam 3

  తొలి రెండు సినిమాల్లోనూ సూర్యకు అనుష్క ప్రియురాలిగా నటించింది. పెళ్లి పీటలు ఎక్కడమే తరువాయి అనుకున్న ప్రతీ సందర్భంలోనూ వారికి ఇబ్బందులు ఎదురవుతాయి. దాంతో తొలి రెండు భాగాల్లోనూ సూర్య, అనుష్క లవర్స్‌గానే కనబడతారు. కానీ, ఈ మూడో భాగంలో మాత్రం సూర్యకు భార్యగా కనిపిస్తుందట స్వీటీ. ఈ సినిమాలో మరో హీరోయిన్‌ శృతీహాసన్‌. ఇందులో శృతీది గ్లామరస్‌ పాత్రే అయినప్పటకీ ఆమెకు యాక్షన్‌ సీన్స్‌ కూడా ఉంటాయట. అయితే ఈ సినిమాలో ఇద్దరు భామలూ పోటీ పడి మరీ గ్లామర్‌ విందు చేశారట. రిపబ్లిక్‌ డే సందర్భంగా ఈ సినిమా జనవరి 26న విడుదల కానుంది.

  English summary
  As seen in the first two versions, Suriya in love with Anushka could never get to marry her. But it looks like, finally, the duo will tie the knot in the 3rd version. Sources reveal that the marriage scenes have been shot in a grand and lavish manner in Karaikudi.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more