సూర్య సినిమాలో పవన్ కళ్యాణ్ ముద్ర..లుక్కు, టైటిల్ వెనుక రహస్యం అదే!
గ్యాంగ్ చిత్రంతో మంచి విజయం అందుకున్న సూర్య అదే ఉత్సాహంతో మరో చిత్రాన్ని మొదలు పెట్టాడు. తమిళ ప్రముఖ దర్శకుడు సెల్వరాఘవన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజగా ఈ చిత్ర ఫస్ట్ లుక్, టైటిల్ ని అనౌన్స్ చేసారు. ఈ చిత్రానికి ఎన్‌జికె అనే ఆసక్తికరమైన టైటిల్ ఖరారు చేయడం విశేషం. సూర్య లుక్ కూడా క్యూరియాసిటీ పెంచేస్తోంది. ఈ చిత్రం ఎలాంటి కథతో రూపొందుతోంది, టైటిల్ వెనుక ఉన్న రహస్యం ఏమిటి అని అభిమానులు సినీవర్గాలు ఆసక్తిగా చర్చించుకుంటున్నాయి.

గ్యాంగ్ తో మెప్పించాడు
సంక్రాంతి సీజన్లో గ్యాంగ్ చిత్రంతో సూర్య ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ చిత్రం మంచి విజయం సాధించింది.

మరో సినిమా
అదే ఉత్సాహంతో సూర్య మరో చిత్రాన్ని ప్రారంభించాడు. సెల్వరాఘవన్ దర్శకత్వంలో సూర్య నటించనున్నాడు.

ఆసక్తి రేపుతున్న ఫస్ట్ లుక్, టైటిల్
ఈ చిత్ర ఫస్ట్ లుక్ మరియు టైటిల్ తాజగా విడుదల చేసారు. ఈ చిత్ర టైటిల్ ఎన్‌జికె. టైటిల్ ఎంత ఆసక్తికరంగా ఉందో సూర్య లుక్ కూడా అంతే క్యూరియాసిటీని పెంచేస్తోంది.

ఫస్ట్ లోక్ లో పవన్ కళ్యాణ్ ముద్ర
ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ని గమనిస్తే పవన్ కళ్యాణ్ జనసేనపార్టీ తరహాలో పిడికిలి గుర్తు కనిపిస్తోంది. దీనిపై సినీ వర్గాలు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. విప్లవ కారుడు చేగువేరా పోలికలతో సూర్య లుక్ ఉందని కూడా అంటున్నారు.

నాయకుడిగా సూర్య
సూర్య ఈ చిత్రంలో విప్లవ నాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడని తమిళ మీడియా ఊహాగానాలు వ్యక్తం చేస్తోంది. సూర్య పోస్టర్ లో కమ్యూనిజం భావజాలానికి సంబందించిన గుర్తులు కనిపిస్తుండడంతో ఆ నేపథ్యంలో కథ ఉంటుందని అంటున్నారు.

అది సూర్య పాత్ర పేరు
దర్శకుడు సెల్వ రాఘవన్ మాట్లాడుతూ ఎన్‌జికె అనేది చిత్రాల్లో సూర్య పాత్ర పేరు అని అన్నారు. మిగిలి విషయాలు సినిమా చూసే తెలుసుకోవాలని సస్పెన్స్ లోకి నెట్టేశారు. ఈ చిత్రంలో సూర్య సరసన సాయిపల్లవి, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లు గా నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











