For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  ప్రభాస్, సూర్యలో బాక్సాఫీస్ కింగ్ ఎవరు?.. ఆగస్టు 15న రచ్చ రచ్చే!

  |

  బాహుబలి సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొన్న యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ సాహో చిత్రంతో ముందుకొస్తున్నారు. దేశవ్యాప్తంగా తనకు ఉన్న క్రేజ్‌కు తగినట్టుగానే, ప్రేక్షకులను సంతృప్తి పరిచేందుకు శ్రద్ధాకపూర్, ఇతర బాలీవుడ్ నటీనటులతో భారీ ప్యాకేజ్‌గా రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకు స్వాత్రంత్ర్య ఉద్యమం లింక్ ఉండటం మూలాన సాహోను ఇండిపెండెన్స్ డే రోజున విడుదల చేయాలని డిసైడ్ చేశారు. అయితే అదే రోజున సూర్య తన చిత్రంతో సిద్ధమయ్యాడు. అదే జరిగితే బాక్సాఫీస్ వద్ద ప్రభాస్, సూర్య తమ సత్తాను తేల్చుకోవడానికి నువ్వా నేనా అనే రీతిలో పోటీకి సిద్ధమవుతున్నారు.

   సాహో మూవీ పరిస్థితి ఏమిటంటే

  సాహో మూవీ పరిస్థితి ఏమిటంటే

  సాహో సినిమా విషయానికి వస్తే.. హైదరాబాద్ పరిసర పాంత్రాల్లో శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్నది. ప్రభాస్, ఇతర నటీనటులపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. రామోజీ ఫిలిం సిటీ ప్రాంతంలో ప్రత్యేకమైన సెట్ వేసి యాక్షన్ సీన్లు చిత్రీకరిస్తున్నారు. నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్‌లపై ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.

  రూ. 300 కోట్లతో మూడు భాషల్లో

  రూ. 300 కోట్లతో మూడు భాషల్లో

  సుమారు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న సాహో చిత్రానికి మాది సినిమాటోగ్రఫిని అందిస్తున్నారు. బాలీవుడ్ మ్యూజిక్ త్రయం శంకర్, ఎహసాన్, లాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతున్నది. ఈ చిత్రం హిందీ హక్కులను కరణ్ జోహర్ సంస్థ ధర్మ ప్రొడక్షన్ సొంతం చేసుకొన్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని కూడా ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నారు.

   సూర్య సినిమా రిలీజ్ వైపు

  సూర్య సినిమా రిలీజ్ వైపు

  ఇక తమిళంలో సూర్య నటిస్తున్న కాప్పన్ అనే చిత్రం చివరి షెడ్యూల్‌లో ఉంది. ప్రస్తుతం తంజావూర్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్నది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా రూపొందిస్తున్న ఈ చిత్రానికి కేవీ ఆనంద్ దర్శకుడు. ఈ చిత్రంలో ఐదు రకాల గెటప్స్‌లో సూర్య కనిపిస్తాడు.

   భారీ తారాగణంతో

  భారీ తారాగణంతో

  ప్రతిష్టాత్మకంగా రూపొందున్న కాప్పన్ చిత్రంలో మోహన్ లాల్, ఆర్య, సాయేషా, బోమన్ ఇరానీ తదితరులు నటిస్తున్నారు. హ్యారీస్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్వాతంత్ర్య దినోత్సవం రోజున రిలీజ్ చేసేందుకు సిద్ధం చేస్తున్నారు.

  ప్రభాస్ 20 కథ వినగానే పిచ్చెక్కిపోయింది.. అది ఒక ఛాలెంజ్, హీరోయిన్ క్రేజీగా!

  బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ

  బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ

  సాహో, కాప్పన్ సినిమాలను పరిశీలిస్తే భారీ తారాగణం, బడ్జెట్‌తో రూపొందుతున్నాయి. ఈ రెండు చిత్రాలు మూడు ప్రాంతీయ భాషల్లో రిలీజ్ కానున్నాయి. సాంకేతికంగా కూడా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. దాంతో ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటి పడితే వచ్చే రెస్పాన్స్ అనూహ్యంగా ఉంటుందనే మాట వినిపిస్తున్నది.

  English summary
  Suriya’s action thriller Kaappaan and Prabhas' high-octane action adventure Saaho are likely to clash for the Independence Day weekend. However, sources say even if Saaho gets delayed, Kaappaan will definitely target the Independence Day weekend date since the film's theme goes in line with the occasion.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more