»   » మసీదులో సూర్య.. ఇస్లాం మతంలోకి.. ఏఆర్ రెహ్మాన్ కోరిక మేరకు..

మసీదులో సూర్య.. ఇస్లాం మతంలోకి.. ఏఆర్ రెహ్మాన్ కోరిక మేరకు..

Posted By:
Subscribe to Filmibeat Telugu

కోలీవుడ్ నటుడు సూర్య ఇటీవల మసీదుకు వెళ్లి ప్రార్థన చేయడం చర్చనీయాంశమైంది. అయితే మత మార్పిడికి ప్రయత్నిస్తున్నాడనే రూమర్లు జోరుగా షికారు చేయడంతో అభిమానుల, సినీవర్గాలు షాక్ గురయ్యాయి. మసీదును సందర్శించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో విస్తృతంగా ప్రచారమవుతున్నది. ఎప్పడూ వివాదాలకు దూరంగా ఉండే సూర్య ఇలాంటి వ్యవహారంలో చిక్కుకోవడం మీడియా దృష్టిని ఆకర్షించింది.

మసీదులో సూర్య..

మసీదులో సూర్య..

ప్రస్తుతం దర్శకుడు విగ్నేష్ శివన్ డైరెక్షన్‌లో హీరో సూర్య థానా సెర్నాధా కొట్టం అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవల పూర్తయింది. ఈ నేపథ్యంలో సందర్భంగా సూర్య మసీదుకు వెళ్లి ప్రార్థనలు చేసినట్టు ఉన్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఓ దశలో సూర్య మతం మార్చుకొన్నాడా అనే సందేహాలు తలెత్తాయి.

 రెహ్మాన్ కోరిక మేరకు..

రెహ్మాన్ కోరిక మేరకు..

ఈ నేపథ్యంలో సూర్య మీడియాకు అసలు విషయాన్ని వివరించాడు. మూడేళ్ల క్రితం కడపలోని మసీదును సందర్శించాను. సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ కోరిక మేరకు కడపలోని మసీదును సందర్శించాను. అంతేకాని ఇస్లాంలోకి మారుతున్నట్టు వచ్చిన వార్తలను ఈ సందర్భంగా ఖండించాడు. ఆ తర్వాత ఆ వీడియోను యూట్యూబ్ నుంచి తొలగించారు.

వంద కోట్ల క్లబ్‌లో..

వంద కోట్ల క్లబ్‌లో..

ఇటీవల సూర్య నటించిన సింగం3 చిత్రం ఘన విజయాన్ని సాధించింది. బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. ప్రస్తుతం భార్య జ్యోతిక నటిస్తున్న మంగలిర్ మట్టం చిత్రంపై సూర్య దృష్టిపెట్టాడు.

ఈ ఏడాది చివర్లో..

ఈ ఏడాది చివర్లో..

ప్రస్తుతం సూర్య నటిస్తున్న చిత్రం థానా సెరంధా కూట్టమ్ ఈ ఏడాది చివర్లో విడుదల కానున్నది. ఈ చిత్రంలో కీర్తి సురేశ్, రమ్యకృష్ణ, సంత్యాన్, సెంథిల్ నటించారు. స్టూడియో గ్రీన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.

English summary
Suriya is presently shooting for his next with Vignesh Shivan titled Thana Serndha Koottam.While the actor is wrapping up the shoot, a video of Suriya visiting a mosque went viral on social media.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu