»   » ఐశ్వర్య రాయ్ సర్ ప్రైసింగ్ ఐటమ్ సాంగ్!

ఐశ్వర్య రాయ్ సర్ ప్రైసింగ్ ఐటమ్ సాంగ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

అందాల సుందరీ ఐష్ కమీనా, కజరారే అంటూ రెండు సార్లు ప్రత్యేక పాటల్లో నర్తించిన అందాల తార ఐశ్వర్యారాయ్ మూడోసారి స్పెషల్ సాంగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అక్షయ్ కుమార్, దీపికా పదుకొనే జంటగా రూపొందుతున్న 'హౌస్ ఫుల్" చిత్రంలో ఐష్ స్పెషల్ సాంగ్లో ఓ మెరుపు మెరవనున్నారు. నాలుగు రోజుల పాటు చిత్రీకరణ జిరిగే ఈ పాట హౌస్ ఫుల్ చిత్రానికే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు.

ఈ పాట చిత్రీకరణ ఏర్పాటు కొరకు ముంబైలోని ఫిలిం సిటీ స్టూడియోలో ఓ ప్రత్యేక సెట్ ను ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. ఇందులో అక్షయ్, దీపిక, అర్జున్, రితేష్, జియా, లారా తదితరులు కనిపించనున్నట్లు సమాచారం. అంతే కాకుండా ఈ సాంగ్ లో 200 మంది డాన్సర్లు, 500 మంది జూనియర్ ఆర్టిస్టులు కూడా పాల్లొంటారని తెలియజేస్తూ ఈ చిత్ర ప్రచారానికి కూడా ఇదే సాంగ్ ను విరివిగా వాడాలని దర్శకనిర్మాతలు తెలియజేశారు. దీనిని బట్టి ఈ పాట ఎంత భారీ ఎత్తున ఉంటుందో ఊహించుకోవచ్చు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu