»   »  ఐశ్వర్యరాయ్‌తోనే డ్రామాలా? దర్శకుడి తీరుపై విమర్శలు!

ఐశ్వర్యరాయ్‌తోనే డ్రామాలా? దర్శకుడి తీరుపై విమర్శలు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యరాయ్ చంద్రముఖి ఫేం పి.వాసు దర్శకత్వంలో సినిమా చేయడానికి అంగీకరించినట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని పి.వాసు స్వయంగా ప్రకటించంతో ఈ వార్తలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఐశ్వర్యరాయ్ ఫోటోతో కూడిన యానిమేషన్ ఫస్ట్‌లుక్ కూడా విడుదల చేయడంతో ఈ వార్త నిజమే అని అంతా అనుకున్నారు.

అయితే తాను సినిమాకు సైన్ చేసినట్లు పి.వాసు ప్రచారం చేయడంపై ఐశ్వర్యరాయ్ ఖండించింది. తాను ఇంకా ఏ సినిమాకు ఓకే చెప్పలేదని ఆమె తన పిఆర్ మేనేజర్ ద్వారా స్పష్టం చేసింది. పి.వాసు సినిమా ఆఫర్ చేసిన మాట వాస్తవమే, కానీ ఐశ్వర్యరాయ్ ఇంకా సైన్ చేయలేదు అని పిఆర్ మేనేజర్ తెలిపారు.

ఐశ్వర్యరాయ్ తన తర్వాతి సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని లాస్ట్ సండే దర్శకుడు వి.వాసు గర్వంగా ప్రకటించుకున్నారు. ఐశ్వర్యరాయ్‌కి తాను చెప్పిన స్టోరీ ఎంతగానో నచ్చిందని, తన సినిమాలో ఆమె కలరి యుద్ధవిద్య ప్రదర్శించే యోధురాలిగా కనిపించబోతోందని పి.వాసు ప్రకటించారు. సినిమా కోసం ఆమెకు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ కూడా ఇప్పించనున్నట్లు పి.వాసు చెప్పుకొచ్చారు.

ఈ సినిమా కోసం ప్రపంచ ప్రఖ్యాత విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీలను సంప్రదించినట్లు మీడియాకు రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ల దర్శకుడు పి.వాసు చెప్పుకొచ్చారు. ఫ్రాన్స్ నుండి యానిమేషన్ నిపుణులను రప్పిస్తున్నట్లు కూడా దర్శకుడు వెల్లడించారు. నార్త్ ఇండియాలోని లొకేషన్లతో పాటు కాంబోడియాలో షూటింగ్ ప్లాన్ చేసినట్లు తెలిపారు.

అయితే ఐశ్వర్యరాయ్ మాత్రం తాను ఇంకా సైన్ చేయలేదని చెప్పడంతో పి.వాసు తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్లైడ్ షోలో మరిన్ని వివరాలు......

ఐశ్వర్యరాయ్ స్టేట్మెంట్

ఐశ్వర్యరాయ్ స్టేట్మెంట్

నా వద్దకు ఇప్పటి వరకు చాలా మంది సినిమా ఆఫర్లతో వచ్చారు. అందులో పి.వాసు కూడా ఒకరు. అందరి కథలు విన్నట్లే వీరి కథ కూడా విన్నాను. అంతే కానీ నేను ఇప్పటి వరకు ఏ సినిమాకు కూడా కమిట్ కాలేదని స్పష్టం చేసారు.

పి.వాసు ప్రెస్ రిలీజ్ చూసి ఆశ్చర్యం వేసింది

పి.వాసు ప్రెస్ రిలీజ్ చూసి ఆశ్చర్యం వేసింది

నేను ఇంకా ప్రాజెక్టుకు సైన్ చేయక పోయినా.... చేసినట్లు తన ప్రెస్ రిలీజ్‌లో పి.వాసు పేర్కొనడం ఆశ్చర్యం వేసిందని ఐశ్వర్యరాయ్ స్టేట్మెంటులో పేర్కొంది.

ఐశ్వర్యరాయ్ ఫస్ట్ లుక్

ఐశ్వర్యరాయ్ ఫస్ట్ లుక్


సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా పి.వాసు విడుదల చేసారు. ఈ ఫస్ట్ లుక్ ఐశ్వర్యరాయ్ యానిమేషన్ ఫోటోతో కూడి ఉంది.

ఐశ్వర్య రాయ్ అభిమానుల ఆశ్చర్యం

ఐశ్వర్య రాయ్ అభిమానుల ఆశ్చర్యం


కాగా...ఐశ్వర్యరాయ్ స్టేట్మెంట్ చూసి అభిమానులు ఆశ్యర్య పోతున్నారు. ఈ చిత్రానికి ఆమె త్వరలోనే అంగీకారం తెలుపుతుందని భావిస్తున్నారు. ఐశ్వర్యరాయ్ అంగీకరిస్తే ఈచిత్రాన్ని గ్లోబల్ వన్ స్టూడియోస్ పతాకంపై కె.రమేష్ నిర్మించనున్నారు.

మణిరత్నం తర్వాతి చిత్రంలో ఐశ్వర్యరాయ్?

మణిరత్నం తర్వాతి చిత్రంలో ఐశ్వర్యరాయ్?


మరో వైపు ఐశ్వర్యరాయ్ మణిరత్నం చిత్రంలో రాబోయే చిత్రానికి అంగీకరించినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మహేష్ బాబు, శృతి హాసన్ కూడా ఇందులో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

English summary
In what could be a huge embarrassment for P Vasu and his team, Aishwarya Rai Bachchan has denied the reports, which claimed that she had signed his forthcoming movie. Through her PR, the actress has clarified that she has not signed the project, but has admitted that the filmmaker had offered the movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu