»   » రేప్ సీన్స్: నరకం అనుభవించానంటున్న హీరోయిన్

రేప్ సీన్స్: నరకం అనుభవించానంటున్న హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: ఇటీవల విడుదలైన బాలీవుడ్ మూవీ 'హేట్ స్టోరీ-2' చిత్రం ట్రైలర్‌కు యూట్యూబులో మంచి స్పందన వస్తోంది. ఈ ట్రైలర్ విడుదలైన తర్వాత మిలియన్ల కొద్దీ వీక్షకులు వీక్షించారు. ఇందులో హాట్ అండ్ సెక్సీ సీన్లు ఉండటం వల్ల నెటిజన్లను, ముఖ్యంగా యూత్‌ను బాగా ఆకర్షిస్తోంది.

హీరోతో రొమాంటిక్ సీన్లతో పాటు సినిమాలో హీరోయిన్ సుర్వీన్ చావ్లాపై విలన్ రేప్ చేసే సీన్లు కూడా ఉన్నాయి. ఈ సీన్లను అత్యంత క్రూరంగా తెరపై చూపించబోతున్నారు. రేప్ సీన్లు చేస్తున్నపుడు చాలా కష్టంగా అనిపించిందని, చాలా ఒత్తిడికి గురయ్యానని, ఒక రకగా చెప్పాలంటే నరకం అనుభవించానని చెప్పింది సుర్వీన్ చావ్లా.

Surveen Chawla Suffers Trauma Post Sexual Scene

'హేట్ స్టోరీ-2 చిత్రంలో నా క్యారెక్టర్ చేస్తున్నపుడు కంప్లీట్‌గా పాత్రలో లీనం అయ్యాను. కోస్టార్ సుశాంత్ సింగ్‌తో కలిసి రేప్ సీన్ చేస్తున్నపుడు చాలా కష్టంగా, నరకంలా అనిపించింది. రియల్ లైఫ్‌లో అలాంటి సంఘటనలు ఎదుర్కొంటున్నపుడు మహిళలు ఎంత వేదనకు గురవుతారో నేను అర్థం చేసుకోగలను' అంటోంది సుర్వీన్ చావ్లా.

గతంలో 'హేట్ స్టోరీ' చిత్రాన్ని నిర్మించిన విక్రమ్ భట్ 'హేట్ స్టోరీ 2' ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నారు. 'హేట్ స్టోరీ 2' చిత్రానికి విక్రమ్ భట్ అసిస్టెంట్ విశాల్ పాండే దర్శకత్వం వహిస్తున్నారు. టీవీ యాక్టర్ జయ్ భానుశాలి, పంజాబీ నటి సర్వీన్ చావ్లా ఈ చిత్రంలో జంటగా నటిస్తున్నారు.

తన జీవితాన్ని, ప్రేమను నాశం చేసిన ఒక వ్యక్తిపై ఓ మహిళ ఎలా రివేంజ్ తీర్చుకుంది అనే కథాంశంతో ఈచిత్రం సాగుతుంది. హీరో హీరోయిన్ల మధ్య సాగే హాట్ హాట్ బెడ్రూం సీన్లు, ముద్దు సీన్లు సినిమాకు హైలెట్ కానున్నాయి. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఈచిత్రంలో మెయిన్ విలన్‌గా నటిస్తున్నాడు.

English summary

 The trailer of Hate Story 2 is being talked about for the bold scenes involving actress Surveen Chawla. But the actress says shooting for one sequence in Hate Story 2 involving sexual violation left her suffering from a temporary nervous breakdown.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu