»   » 'సింగం'.. యముడు-2 గురించి సూర్య

'సింగం'.. యముడు-2 గురించి సూర్య

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్: అతి తక్కువకాలంలో స్టార్ హీరోగా ఎదిగిన నటుడు సూర్య. తక్కువ సినిమాలతో ఎక్కువ పేరు సొంతం చేసుకుని కోలీవుడ్‌,టాలీవుడ్ లలో దూసుకెళుతున్నాడు. పోలీసుగా 'దురైసింగం' పాత్రలో జీవించిన 'సింగం' కమర్షియల్‌గా రికార్డులు సృష్టించింది. తెలుగులో అనుకున్న స్థాయికన్నా ఎక్కువ వసూళ్లు రాబట్టింది.

ఆ చిత్రానికి ఇప్పుడు కొనసాగింపుగా 'సింగం-2' సిద్ధమైంది. వచ్చే నెల 5న 2,400 థియేటర్లలో సందడి చేయనుంది. తెలుగులోనూ 'సింగం'.. యముడు-2 ఉప శీర్షికన విడుదల కానుంది. ఈ సందర్భంగా సూర్య మీడియాకు మాట్లాడారు.

'సింగం-2' ఆలోచన ఎలా వచ్చిందంటే... 'సింగం' సక్సెస్ దర్శకుడిగా హరికి, నటుడిగా నాతోపాటు ప్రతి ఒక్కరికీ ఎంతో పేరు తెచ్చిపెట్టింది. నిజానికి నేనే దురైసింగానికి అభిమానిగా మారిపోయా. మరోసారి దురైసింగాన్ని తెరపైకి తీసుకురావాలని అనుకున్నాం. ఒకసారి హరి ఫోన్‌ చేసి 'దురైసింగం'ను మరో స్థాయికి తీసుకెళ్లేందుకు మంచి కథ దొరికింద'ని చెప్పారు. అలా 'సింగం-2' సెట్స్‌పైకి వచ్చింది. నా కెరీర్‌లో ఇది మరో మైలురాయిలా ఉంటుంది అన్నారు.


బాలీవుడ్‌కు వెళతారా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ... మణిరత్నంకు అసలు సిసలైన గ్రామీణ చిత్రాలను రూపొందించాలనే కోరిక ఎప్పటినుంచో ఉంది. నగర ప్రాంతాల ఆధారంగానే చిత్రీకరిస్తున్నారు. పల్లెటూరి కథలను బాలా బాగా తెరకెక్కిస్తున్నారు. 'నంద', 'పితామగన్‌' చూసిన మణిరత్నం 'ఇన్ని పాత్రలను పూర్తి వాస్తవికతో ఎలా చూపగలుగుతున్నావ్‌.. నీవద్ద పని చేయాలనుంద'ని బాలా దగ్గరికెళ్లి చెప్పారట. ఒక్కొక్కరిది ఒక్కోశైలి. నాకు తమిళనాడు, తమిళసినిమా, తమిళ ప్రజలే బలం. అందుకే ఇక్కడ ఉండాలనుకుంటా. తెలుగు ప్రేక్షకులూ ఆదరిస్తున్నారు.ప్రస్తుతానికి ఇది చాలు. హిందీలో నటించాలనే కోరిక లేదు అన్నారు.

ప్రస్తుతం సూర్య గౌతంమీనన్‌ దర్శకత్వంలో రానున్న 'ధ్రువనక్షత్రం' చేస్తున్నారు. ఆ చిత్రం గురించి చెప్తూ... ప్రత్యేక ప్రేమకథా చిత్రం. 'వారనం ఆయిరం'లా తొలిభాగం చాలా యవ్వనంగా ఉంటా. లింగుస్వామి సినిమాలో మంచిపాత్ర పోషించా అన్నారు.

English summary
Singam II is an upcoming action-masala film directed by Hari and produced by S. Lakshman Kumar for his newly formed Prince Pictures. It stars Suriya in the title role with Anushka Shetty, Hansika Motwani, Vivek and Santhanam in supporting roles. The film is a sequel to the successful 2010 film Singam. It is currently scheduled to release on July 5, 2013 along with a Telugu dubbed version titled Singham.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu