»   » ‘మేము’ లో హీరో సూర్య పాత్రేంటి

‘మేము’ లో హీరో సూర్య పాత్రేంటి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : తమిళ హీరో సూర్య త్వరలో పిల్లల డాక్టర్ గా కనిపించి అలరించనున్నారు. ఆ చిత్రం మరేదో కాదు ఆయన నిర్మిస్తున్న మేము. చిన్నారుల నేపథ్యంలో పాండిరాజ్‌ రూపొందించిన ‘పసంగ' చిత్రం జాతీయ ఉత్తమ చిత్రంగా పురస్కారాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో నటించిన ఇద్దరు చిన్నారులు కూడా ఉత్తమ బాల నటులుగా అవార్డును సొంతం చేసుకున్నారు.

ప్రస్తుతం ఆయనమళ్లీ బాలల నేపథ్యంతో ‘పసంగ 2'ను (మేము) తెరకెక్కిస్తున్నారు. ఇందులో సూర్య, అమలాపాల్‌, బిందుమాధవి తదితరులు నటించారు. శుక్రవారం ఈ సినిమా విడుదల సందర్భంగా చిత్ర యూనిట్‌ మీడియాతో ముచ్చటించింది. ఈ కార్యక్రమంలో సూర్య, పాండిరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

పాండిరాజ్‌ మాట్లాడుతూ.. నగర చిన్నారులకు సంబంధించిన కథతో దీన్ని రూపొందిస్తున్నాం. ఏడీహెచ్‌డీ సమస్య ఉన్న చిన్నారుల సినిమా ఇది. ఈ సమస్య ఉన్న చిన్నారులు ఒకచోట ఒకటిన్నర నిమిషానికన్నా ఎక్కువగా ఓ చోట కుదురుగా కూర్చోలేరు.

అలా పదిమంది చిన్నారుల తీరును చూసి, వారి విషయాలనే కథగా రాసుకున్నా. ఇందులో పిల్లల డాక్టర్‌గా సూర్య నటించారు. పాఠశాల ఉపాధ్యాయురాలి పాత్రను బిందుమాధవి పోషించారు. వాస్తవానికి ఈ సినిమాకు చిన్నారులే హీరోలు. చిన్నారులు మాత్రమే కాకుండా పెద్దలతోపాటు అన్నివర్గాల ప్రేక్షకులు అన్ని వయస్సు వారు చూడదగ్గ సినిమా ఇది అని తెలిపారు.

ఈ చిత్రాన్ని తెలుగులో సాయిమణికంఠ క్రియేషన్స్‌ పతాకంపై జూలకంటి మధుసూదన్‌రెడ్డి నిర్మిస్తుండగా.. సూర్య-కె.ఇ.జ్ఞానవేల్‌ రాజా సంయుక్తంగా సమర్పిస్తున్నారు. ప్రసాద్‌ సన్నితి-తమటం కుమార్‌రెడ్డి సహ నిర్మాతలు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఆడియోకు, ట్రైలర్‌కు విశేషమైన స్పందన లభిస్తోంది. అన్ని కార్యక్రమాూ శరవేగంగా పూర్తి చేసుకొంటున్న ఈ చిత్రాన్ని తెలుగు-తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Surya as a doctor in Memu movie

జూలకంటి మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘తమిళ`తెలుగు భాషల్లో కలిపి వంద కోట్లకు పైగా మార్కెట్‌ కలిగిన సూర్య నటిస్తూ.. తమిళంలో నిర్మిస్తున్న ‘పసంగ-2' చిత్రాన్ని ‘మేము' పేరుతో తెలుగు ప్రేక్షకుకు అందించే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నాం. సూర్య చేతుల మీదుగా విడుదలైన ‘మేము' ఆడియోకు చాలా మంచి స్పందన వస్తోంది. ‘మనం, దృశ్యం' చిత్రాల కోవలో ‘మేము' ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం మాకుంది' అన్నారు.

ఈ సినిమా మానసిక వ్యాధితో బాధపడే చిన్నారుల చుట్టూ తిరుగుతుంది. పలువురు బాల నటులు మెయిన్ లీడ్స్‌లో నటించిన ఈ సినిమాలో సూర్య పాత్రకు కూడా మంచి ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది.

‘పిశాచి' ఫేం అరోల్‌ కొరెల్లి సంగీత సారధ్యం వహిస్తున్న ఈ చిత్రానికి పాటలు: వెన్నెలకంటి-చంద్రబోస్‌-సాహితి, సంభాషణలు: శశాంక్‌ వెన్నెలకంటి, సహ నిర్మాతలు: ప్రసాద్‌ సన్నితి-తమటం కుమార్‌రెడ్డి, సమర్పణ: సూర్య-కె.ఇ.జ్ఞానవేల్‌రాజా, నిర్మాత: జూలకంటి మధుసూదన్‌రెడ్డి, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: పాండిరాజ్‌.

English summary
“Our regular audience is between the age group of 18-30. Children rarely come to theatre nowadays. I don’t understand why we don’t have enough children’s films and don’t know who needs to be blamed for this,” Suriya
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu