»   » ‘మనం’ దర్శకుడితోనే, ఖరారు చేసిన సూర్య

‘మనం’ దర్శకుడితోనే, ఖరారు చేసిన సూర్య

Posted By:
Subscribe to Filmibeat Telugu
Surya confirms Vikram Kumar film
హైదరాబాద్: త్వరలో అంజాన్ (తెలుగులో.. సికిందర్) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సూర్య తర్వాతి ప్రాజెక్టును ఖరారు చేసారు. ఇటీవల విడుదలైన 'అంజాన్' ట్రైలర్‌కు యూట్యూబులో మంచి రెస్పాన్స్ రావడంతో ఈ ఆనందాన్ని సూర్య మీడియాతో పంచుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన తన భవిష్యత్ ప్రాజెక్టుల గురించి వివరించారు. నెక్ట్స్ 'మనం' ఫేం విక్రమ్ కుమార్ గౌడ్‌తో ఓ సినిమా చేస్తున్నట్లు సూర్య వెల్లడించారు. ఇప్పటికే తమిళ దర్శకుడు హరితో 'సింగం', 'సింగం-2' చిత్రాలు చేసిన సూర్య అతనితో మరో ప్రాజెక్టు చేయబోతున్నట్లు తెలిపారు. 2015లో హరితో సినిమా ఉంటుందని తెలిపారు.

తెలుగులో ఇష్క్, మనం చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న విక్రమ్ కుమార్ సౌత్ ఇండస్ట్రీలో మంచి డిమాండ్ ఏర్పడింది. సూర్య లాంటి హీరోలతో అవకాశం రావడం అంటే మామూలు విషయం కాదు. సూర్యతో సినిమా హిట్ అయితే విక్రమ్ కుమార్ సౌత్ టాప్ డైరెక్టర్ల లిస్టులో చేరడం ఖాయం.

'అంజాన్' సినిమా వివరాల్లోకి వెళితే....

సూర్య, సమంత జోడీగా రూపుదిద్దుకుంటున్న తమిళ సినిమా అంజాన్. తెలుగులో ఈ చిత్రం 'సికిందర్' పేరుతో విడుదల కానుంది. లింగుస్వామి దర్శకత్వం వహించి సొంత నిర్మాణ సంస్థ తిరుపతి బ్రదర్స్ ద్వారా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణంలో యుటీవీ మోషన్ పిక్చర్స్ వారి హస్తం కూడా ఉందని తెలుస్తోంది. యువన్ శంకర్ రాజా సంగీతం సమకూరుస్తున్నారు. ఆగష్టు 15లో ఈ సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.

English summary
Speaking about his future plans, Surya confirmed the news that he will be working with Vikram Kumar of Manam fame. After the success of Manam, Vikram had become the talk of the town and is being flooded with huge offers.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu