»   » 'రక్త చరిత్ర'లో 'సూరి'గా సూర్య గెటప్ ఇదే...

'రక్త చరిత్ర'లో 'సూరి'గా సూర్య గెటప్ ఇదే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న 'రక్తచరిత్ర'లో మద్దెలచెరువు సూరి పాత్రలో తమిళ దర్శకుడు సూర్య పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఆ గెటప్‌ తాలూకు స్టిల్‌ బయిటకు వచ్చి అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక అతని భార్య భానుమతి పాత్రలో ప్రియమణి చేస్తోంది. పరిటాల రవి జీవిత కథ ఆధారంగా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని వర్మ తెరకెక్కిస్తున్నారు. పరిటాల రవిగా వివేక్ ఒబరాయ్ చేస్తున్నారు. సీనర్జి పతాకంపై మధు మంతెన, శీతల్‌ వినోద్‌ తల్వార్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. వచ్చే వారం నుంచి ఈ చిత్రం షెడ్యూల్‌ ముంబైలో జరగనుంది. ఆ తర్వాత హైదరాబాద్‌లో కూడా మరో షెడ్యూల్‌ వుంటుందని నిర్మాతలు చెప్తున్నారు. బిజెనెస్ రీత్యా ఈ చిత్రం మంచి క్రేజ్ సృష్టించే అవాకాశం ఉందని అంతా భావిస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu