»   » హీరో సూర్య...ఇప్పుడు తెలుగు దెయ్యం (వీడియో)

హీరో సూర్య...ఇప్పుడు తెలుగు దెయ్యం (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :తమిళ స్టార్ హీరోల్లో ఒకరిగా చెలామణి అవుతున్న సూర్య తెలుగులో కూడా చక్కటి క్రేజ్‌ను సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఆయన నటించిన పలు తమిళ చిత్రాలు తెలుగులో అనువాదమై పెద్ద విజయాల్ని దక్కించుకున్నాయి. ఈ నేఫధ్యంలో సూర్య నటిస్తున్న మరో తమిళ చిత్రం తెలుగులో విడుదలకాబోతుంది. వివరాల్లోకి వెళితే...సూర్య హీరో గా వెంకట్‌ప్రభు దర్వకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం మాస్. హారర్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తెలుగులో రాక్షసుడు అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రం ట్రైలర్ ని సైతం విడుదల చేసారు. ఆ ట్రైలర్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. మీరూ ట్రైలర్ పై ఓ లుక్కేయండి.


ఈ సినిమాలో ధైర్యవంతుడైన యువకుడిగా, దెయ్యంగా సూర్య పాత్రచిత్రణ రెండు భిన్న పార్శాల్లో సాగనున్నట్లు సమాచారం. ఇటీవలే విడుదల చేసిన ట్రైలర్‌కు సామాజిక అనుసంధాన వేదికల్లో చక్కటి స్పందన లభిస్తోంది. ఈ చిత్రంలో నయనతార, ప్రణీత కథానాయికలుగా నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఞానవేల్‌రాజా రెండు భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలో ఆడియోను, ఈ నెలాఖరున చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

కె.ఇ.జ్ఞానవేల్ రాజా స్టూడియో గ్రీన్ సమర్పణలో మేధా క్రియేషన్స్ పతాకంపై తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. మిరియాల కృష్ణారెడ్డి, రవీంద్ర రెడ్డి నిర్మాతలు. నయనతార, ప్రణిత కథానాయికలు. యువన్ శంకర్ రాజా సంగీత దర్శకుడు. ఈ సినిమా టీజర్ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్లో జరిగింది. సూర్య, వెంకట్ ప్రభు, కె.ఇ.జ్ఞానవేల్ రాజా, సినిమాటోగ్రాఫర్ ఆర్.డి.రాజశేఖర్, కృష్ణారెడ్డి, రవీంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Surya impress you as Rakshasudu (Trailer)

వైవిధ్యమైన కాన్సెప్ట్ తో దర్శకుడు ఈ చిత్రాన్ని మలిచారు. సూపర్ నేచురల్ పవర్స్ ఉన్న వ్యక్తిగా నటించాను. యువన్ శంకర్ రాజా అద్బుతమైన సంగీతాన్ని అందించాడు. నేడు విడుదలైన తమిళ ఆడియోకు మంచి స్పందన వస్తుంది. అని సూర్య అన్నారు. తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని మే 29న విడుదల చేస్తునట్టు కె.ఇ.జ్ఞానవేల్ రాజా తెలిపారు. త్వరలో తెలుగు వెర్షన్ ఆడియోను విడుదల చేస్తామని తెలిపారు.

ఈ సినిమాలో సూర్య సరసన నయనతార, ప్రణిత హీరోయిన్లు. యువన్ శంకర్ రాజా ఈ సినిమాకి మ్యూజిక్ అందించనున్నాడు. 2డి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్య స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాని ఒకేసారి తెలుగులో కూడా రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఇందులో సూర్యది డబుల్ రోల్. ఇందులో సూర్య ఒక పాత్రలో హీరో క్యారెక్టర్, మరొకటి నెగిటివ్ రోల్ చేసాడని ప్రచారం సాగుతోంది. తాజాగా విడుదలై టీజర్ చూస్తే కూడా ఇదే విషయం స్పష్టం అవుతోంది. సూర్య ఈ సినిమాలో దెయ్యం లేదా, నెగిటివ్ ఫోర్స్ గా కనిపిస్తాడని అంటున్నారు. ఇక సినిమాలో యాక్షన్ సన్నివేశాలు అదిరిపోయే విధంగా ఉంటాయిని టీజర్ స్పష్టం చేస్తోంది.

ఆ సంగతి పక్కన పెడితే ఈ సినిమాలో నయనతార నటిస్తుండటం మరో హైలెట్. గతంలో ఎక్స్ పిచ్చి వై పిచ్చి అంటూ 'గజిని'లో గ్లామర్ ను పంచిన నయన్ 'ఘటికుడు' మూవీలోనూ సూర్య సరసన నటించింది. ముచ్చటగా మూడోసారి సూర్యతో రొమాన్స్ చేస్తోంది.

English summary
The makers of Suriya's next most-awaited movie "Masss", which is slated for release in theatres on 15 May, have titled its Telugu version after Chiranjeevi's "Rakshasudu". The trailer of this film released recently and it has been getting tremendous response.
Please Wait while comments are loading...