»   »  కళ్యాణి ప్రధాన పాత్రలో 'చాఫ్టర్ 6'

కళ్యాణి ప్రధాన పాత్రలో 'చాఫ్టర్ 6'

Posted By:
Subscribe to Filmibeat Telugu
Kalyani
'మంత్ర' , 'అనసూయ' విజయం చాలా మందికి స్పూర్తినిస్తోంది. వరసగా చిన్నా పెద్దా తేడా లేకుండా ఇమేజ్ ని పట్టించుకోకుండా హీరోయిన్ ఓరియింటెడ్ ధ్రిల్లర్స్ కి శ్రీకారం చుడుతున్నారు. ఇప్పుడా లిస్టులోకి కళ్యాణి చేరబోతోంది. 'కబడ్డి..కబడ్డి' , 'దొంగోడు','శేషు' వంటి చిత్రాల ఈమె ఆ మధ్య దర్శకుడు సూర్యకిరణ్ ని పెళ్ళి చేసుకుని అడపాదడపా 'హోప్' వంటి సినిమాలలో కనిపిస్తోంది. ఇంతకీ ఈమె ఇప్పుడు నటిస్తున్న చిత్రం పేరు 'చాప్టర్ 6' . దర్శకుడు మరెవరో కాదు భర్తే.

'సత్యం' సినిమాతో పరిచయమైన సూర్యకిరణ్ ఆ తరువాత వరసగా సినిమాలు (ధన 51, బ్రహ్మాస్త్రం, రాజూ భాయ్) తీసాడు. కానీ అవి అంతే స్పీడుగా ఫ్లాఫ్ కావటంతో ఫేడ్ అవుట్ అయ్యాడు. తర్వాత సినీ నటి కళ్యాణిని పెళ్ళి చేసుకుని సెటిల్ అయ్యాడు. ప్రస్తుతం అతను 'చాప్టర్ సిక్స్' అనే సినిమా చేయటానికి రెడీ అవుతున్నాడని తెలుస్తోంది. ఇక ఆ నిర్మాత హరినాధ్ పొలిచర్ల.

గతంలో 'అలెక్స్' ,'వెన్నెల', 'చంద్రహాస్' సినిమాలు తీసిన ప్రొడ్యూసర్ ఆయన. ఆ సినిమాల్లో ఒక్కటీ వర్కవుట్ కాలేదు. కాస్త చెప్పుకోవటానికి 'వెన్నెలే' మేలు. దాంతో మరి ఈ కాంబినేషన్ లో వస్తున్న 'చాప్టర్ సిక్స్' ఎలా ఉండబోతోందో ...ఏం జర్గుతుందోనని పాత సామెతలు గుర్తు చేసుకుంటూ అందరూ చెప్పుకుంటున్నారు. చూద్దాం ఫెయల్యూర్స్ ఆర్ స్టెపింగ్ స్టోన్స్ అని పెద్దలు చెప్తూంటారుగా.. ఈ సారి సక్సెస్ అవ్వచ్చేమో...ఇక ఈ సినిమాలో ప్రధాన పాత్ర కళ్యాణి అయినా రక్షిస్తుందేమో చూద్దాం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X