»   »  రాణా లాంచింగ్ కి డైరక్టర్ ఫిక్స్ అయ్యాడు

రాణా లాంచింగ్ కి డైరక్టర్ ఫిక్స్ అయ్యాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu
K Suryaprakash Rao
ఒక వారస హీరోని డైరక్ట్ చేయటానికి మరో వారసుడు రంగంలోకి దూకుతున్నాడు.సీనియర్ ప్రొడ్యూసర్ డి రామానాయుడు మనవడు రామానాయుడు అలియాస్ రాణా (సురేష్‌బాబు కుమారుడు) హీరోగా పరిచయం కానున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. సెవన్ బై జి బృందావన కాలనీ ఫేమ్ సెల్వ రాఘవన్ దర్శకత్వంలో కొడుకుని పరిచయం చేయాలని సురేష్‌బాబు మొదట భావించాడు.అయితే ఇప్పుడు ఆ నిర్ణయం మారింది. సీనియర్ డైరెక్టర్ కె రాఘవేంద్రరావు కుమారుడు కె సూర్యప్రకాశరావు రంగం మీదికొచ్చాడు. రాణా హీరోగా నటించే తొలి చిత్రాన్ని సూర్యప్రకాశరావు డైరెక్ట్ చేయనున్నాడు. అతను 'నీతో' అనే సినిమాతో హీరోగా కెరీర్‌ను ప్రారంభించాడు. ఆ సినిమా ఆడక పోవడంతో అతనికి అవకాశాలు రాలేదు.

తిరిగి సొంత బానర్‌లో 'మార్నింగ్ రాగ' అనే ఆంగ్ల సినిమాలో నటించాడు. ఇందులో షబానా అజ్మీ, పెరిజాద్ జొరాబియాన్ ప్రధాన పాత్రలు ధరించారు. ఆ తర్వాత 'బొమ్మలాట' (బెల్లీ ఫుల్ ఆఫ్ డ్రీమ్స్) అనే బాలల చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు సూర్యప్రకాశరావు. దీనిని రాణా ప్రొడ్యూస్ చేయడం గమనార్హం. సూర్యప్రకాశరావు స్క్రిప్ట్ నచ్చడంతో అతని దర్శకత్వంలోనే రాణాని పరిచయం చేయాలని సురేష్‌బాబు నిర్ణయించాడు. డిసెంబర్‌లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనున్నది. విశాఖపట్నంలో నిర్మించిన రామానాయుడు స్టూడియోస్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగనున్నది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X