For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అదుర్స్ (సూర్య ‘బ్రదర్స్’ప్రివ్యూ)

  By Srikanya
  |

  హైదరాబాద్ : సూర్య,కాజల్ కాంబినేషన్ లో రూపొంది ఈ రోజు విడుదల అవుతున్న చిత్రం 'బ్రదర్స్‌'. 'గజిని'తో హీరో సూర్య తెలుగులోనూ తనకంటూ ఓ మార్కెట్‌ సృష్టించుకొన్నారు. 'సూర్య సన్నాఫ్‌ కృష్ణన్‌', 'వీడొక్కడే', 'సెవెన్త్‌ సెన్స్‌' సినిమాల్లో తనను తాను కొత్తగా ఆవిష్కరించుకొనే ప్రయత్నం చేశారు. ఇప్పుడు అవిభక్త కవలల కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. దాంతో తెలుగులో 'బ్రదర్స్‌' చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి.

  ఈ చిత్రంలో సూర్య కవలలుగా విరుద్ధ భావాలున్న పాత్రలు పోషించారు. ఒక పాత్ర పేరు అఖిళన్, మరో పాత్ర పేరు విమలన్. ఒకరు కమ్యూనిస్టు భావాలు కలవాడయితే, మరొకరు పూర్తి జాలీ టైప్. అయితే ఇద్దరూ హీరోలే. రెండు పాత్రల్లోనూ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. ఇక ఇందులో దర్శకుడి పని తీరు అద్భుతమని చెప్తున్నారు. సూర్య కథ గురించి మాట్లాడుతూ.. సున్నితమైన కథ ఇది. 'బ్రదర్స్‌' అనగానే అన్నదమ్ముల అనుబంధం మాత్రమే అనుకోవద్దు. అంతకు మించిన విషయాలు చాలా ఉన్నాయి. నేటి సమాజంలో పట్టి పీడిస్తున్న ఓ ముఖ్యమైన అంశాన్ని కూడా స్పృశించాం. దర్శకుడు ఆనంద్‌కి కథ, కథనాలపై స్పష్టత ఉంది. ప్రేక్షకులకు ఏం కావాలో ఆయనకు తెలుసు. ఒకే విషయాన్ని అటు క్లాస్‌కీ, ఇటు మాస్‌కీ అర్థమయ్యేలా చెప్పగలరు అన్నారు.

  అలాగే 'వీడొక్కడే' చిత్రీకరణ సమయంలో ఆనంద్‌ ఈ కథ చెప్పారు. విషయాన్ని చెబుతున్నప్పుడే ఆసక్తిగా అనిపించింది. కొన్ని సన్నివేశాలు వివరిస్తున్నప్పుడు విస్మయం చెందాను. శరీరం కలిసే ఉన్నా... అభిరుచులు వేరుగా ఉండే సోదరుల కథ ఇది. రెండు పాత్రలకూ రెండు రకాల భావోద్వేగాలను పలకించాలి. కానీ సన్నివేశం ఒక్కటే. ఎలాంటి నటుడికైనా... ఇదో సవాల్‌. ఇలాంటి కథ దక్కడం నా అదృష్టం అని చెప్తున్నారు.

  దర్శకుడు కె.వి.ఆనంద్ మాట్లాడుతూ... థాయిలాండ్‌కు చెందిన అవిభక్త కవలలను స్పూర్తిగా తీసుకుని తెరకెక్కిస్తున్న చిత్రం 'బ్రదర్స్‌'. ఈ కవలలు అమెరికా వెళ్లి ఒక సర్కస్ కంపెనీ ప్రారంభించి బాగా ఉన్నత స్థితికి చేరుకున్నారని శివాజీ చిత్ర షూటింగ్ సమయంలో ఫ్లైట్‌లో పయనిస్తుండగా ఒక మ్యాగజైన్‌లో చదివానన్నారు. అప్పుడే దీన్ని ఇతివృత్తంగా తీసుకుని చిత్రం చేద్దామని సూర్యతో చెప్పానన్నారు. ఖచ్చితంగా సూర్య అభిమానులనే కాకుండా అందరినీ అలరిస్తుందని నమ్మకం వ్యక్తం చేసారు.

  నటీనటులు: సూర్య, కాజల్, వివేక్, సచిన్ కేడెకర్, తార, రవిప్రకాష్, శంకర్ కృష్ణమూర్తి తదితరులు
  సంగీతం: హారిస్ జైరాజ్,
  మాటలు: శశాంక్ వెన్నెలకంటి,
  కెమెరా: ఎస్.సౌందర్యరాజన్,
  ఎడిటింగ్: ఆంథోని,
  పాటలు: చంద్రబోస్, వనమాలి,
  నిర్మాతలు: బెల్లంకొండ సురేష్, బెల్లంకొండ గణేష్‌బాబు,
  సమర్పణ: కె.ఇ.జ్ఞాన్‌వేల్ రాజా,
  స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కె.వి.ఆనంద్.

  English summary
  Surya and director K V Anand's Brothers is releasing today (October 12) in big way in Andhra Pradesh. The film has already created enough buzz thanks to its novel storyline and trailers. Surya is pretty confident about this film. He playing the role of Siamese twin is the major attraction. The film comes with twists, mystery and unpredictable turns. For the first time in his career Surya has dubbed his voice in Telugu.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X