సూర్య మూవీ టైటిల్‌లో మార్పు: ‘ఎస్3’ కాదు.. ‘సీ3’
చెన్నై: తమిళ హీరో సూర్య నటించిన 'ఎస్3' (సింగం 3) చిత్రం టైటిల్ మారింది. ఇకపై ఈ సినిమాను 'ఎస్ 3' అని కాకుండా 'సీ 3' అని పిలవబోతున్నారు. తమిళనాట వినోదపు పన్ను మినహాయింపు పొందేందుకు 'ఎస్3'ని కాస్త 'సీ3'గా చిత్ర బృందం మార్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే తెలుగులో ఎస్ 3 అనే ఉంటుందని టాక్.
ఈ మార్పును ఖరారు చేస్తూ విషయాన్ని .. చిత్ర నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ ఓ ట్వీట్ చేసింది. కోయంబత్తూర్‌లోని కొవైలో 'సీ3' చిత్ర బృందం సందడి చేయనున్నట్ల పేర్కొంది. సూర్య మంగళవారం మధ్యాహ్నం కొవై గంగా థియేటర్‌కు, సాయంత్రం కేరళలో ఏర్పాటు చేసిన ఫ్యాన్స్ మీట్‌కు హాజరవుతున్న సందర్భంలో ఈ ట్వీట్ చేసారు.

రిలీజ్ డేట్
‘సింగం' సిరీస్‌లో ఇది మూడో చిత్రం. గత రెండు సినిమాలకు దర్శకత్వం వహించిన హరి ఈ చిత్రాన్ని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అనుష్క, శ్రుతిహాసన్, రాధిక, నాజర్ తదితరులు చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ నెల 26న ‘సీ3' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు రాబోబోతోంది.

రూ. 18 కోట్లకు రైట్స్
‘సింగం-3' తెలుగు హక్కులను మల్కాపురం శివకుమార్ రూ. 18 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. సినిమా డిసెంబర్లోనే విడుదలవ్వాల్సి ఉండగా... తమిళనాడులో ప్రకృతి బీభత్సం, తర్వాత జయలలిత మరణం నేపథ్యంలో సినిమా వాయిదా పడుతూ వచ్చింది.

అంతా షాక్: హీరో సూర్య తన భార్య జ్యోతిక కోసం నడిరోడ్డుపై...!

అబ్బా..! మళ్ళీ నెగెటివ్ టైటిలేనా..?? విజయ్ ఆంటోనీ కొత్త టైటిల్ ఏమిటంటే....
'గాడ్ ఫాధర్' టైప్ కథ అని ముందే చెప్పాసారు, ఏంటో ఆ ధైర్యం?


Click it and Unblock the Notifications











