»   » సూర్య ‘సింగం3’ స్టోరీ లైన్ ఏంటి, టాక్ ఏంటి, ఆడుతుందా?

సూర్య ‘సింగం3’ స్టోరీ లైన్ ఏంటి, టాక్ ఏంటి, ఆడుతుందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సూర్య, అనుష్క, శ్రుతిహాసన్‌ ప్రధాన ప్రాతలుగా తెరకెక్కిన చిత్రం 'ఎస్‌3(సింగం3)'. 'సింగం 3' ఈ గురువారం (ఫిబ్రవరి 9న) తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలవుతోన్న విషయం తెలిసిందే. సూర్యకు ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా, సుమారు 2000 థియేటర్లలో సినిమాను విడుదల చేసేందుకు టీమ్ సిద్ధమవుతోంది.

ఇక విడుదలకు మరికొద్ది గంటలే ఉండగా, టీమ్‌ను పైరసీ భూతం వెంటాడుతోంది. ముఖ్యంగా కొన్ని వెబ్‌సైట్‌లు 'సింగం 3' సినిమాను విడుదల రోజునే మార్నింగ్ షో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని చాలెంజ్ చేయడంతో 'సింగం 3' నిర్మాతలు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

సింగం సిరీస్‌లో తొలి రెండు చిత్రాలు మంచి విజయం సాధించడంతో ఈ చిత్రంపైనా భారీ అంచనాలున్నాయి. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి హరి దర్శకత్వం వహించారు.

ఇప్పటికే ఎన్నో వాయిదాలు పడుతూ వచ్చిన ఈ చిత్రం ఈ రోజు రిలీజ్ అవుతుందని అబిమానులు ఎదురుచూసారు. అయితే అనుకోని విధంగా చిత్రం తెలుగులో మార్నింగ్ షో మాత్రం విడుదల వాయిదా పడింది. అయితే యుఎస్ లో ఈ చిత్రం షోలు ఆల్రెడీ పడ్డాయి. అక్కడ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం స్టోరీ లైన్, టాక్ మీకు అందిస్తున్నాం.

కమీషనర్ మర్డర్

కమీషనర్ మర్డర్

ఈ చిత్రం కథ అంతా .. కమీషనర్ మర్డర్ ఇన్విస్టిగేషన్ డ్రామా గా జరుగుతుంది. ఇద్దరు హై ఫ్రొఫైల్ బిజినెస్ పర్శన్స్ ... కలిసి మంగళూరు కమీషనర్ నిచంపేస్తారు. కర్ణాటకలో లా అండ్ ఆర్డర్ సిట్యువేషన్ అవుటాఫ్ కంట్రోల్ అవుతుంది. అప్పుడు కర్ణాటక గవర్నమెంట్ ఆ కేసుని సీబీఐ కు అప్పచెప్తుంది. ఎపి కేడర్ నరసింహ (సూర్య) ని ఈ కేసుకు నియమిస్తారు. అక్కడ నుంచి కథ పలు లొకేషన్స్ కు తిరుగుతూ విలన్స్ తో హీరో చెడుగుడు ఆడుతూ సాగుతుంది.

అనుష్క మైనస్

అనుష్క మైనస్

ఇక సింగం రెండు పార్ట్ లు హై ఛార్జెడ్ యాక్షన్ సీక్వెన్స్ లతో సాగి సక్సెస్ అయ్యాయి. కానీ పార్ట్ 3 కు వచ్చేసరి పాత్రలకు ప్రోపర్ ఎలివేషన్ లేకుండా సాగుతుంది. అలాగే సినిమాకు నరసిహం భార్యగా చేసిన అనుష్క పైద్ద మైనస్ గా మారిందంటున్నారు. అలాగే కానిస్టేబుల్ తో సాగే కామెడీ ట్రాక్ అసలు ఇప్రెస్ చేయలేదు. పోనీ మాస్ ఐటం సాంగ్ అయినా వర్కవుట్ అయ్యిందా అంటే అదీ లేదు.

అప్పటిదాకా విసుగే

అప్పటిదాకా విసుగే

ఫస్టాఫ్ లో ఇంట్రవెల్ కు ముందు దాకా పెద్ద కిక్ ఇవ్వలేదు. ఇంట్రవెల్ దగ్గరకు వచ్చే అరగంట నుంచి యాక్షన్ మోడ్ లోకి కథ వెళ్లి సినిమాకు వెల్లిన వాళ్లకు న్యాయం చేయటం మొదలెట్టింది. అక్కడదాకా ఇదేంటి మనం చూస్తున్నది సింగం సీరిస్ లో సినిమాయోనా అనే సందేహం వచ్చింది.

గర్జనలు కలిసి రాలేదు

గర్జనలు కలిసి రాలేదు

ఇక సింగం 3 ఫస్టాఫ్ యావరేజ్ అనే చెప్పాలి. సూర్య స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ గా గర్జించినా, కథ లేక పోవటం సీన్స్ సపోర్ట్ గా నిలబడకపోవటంతో అవి కేవలం అరుపులుగానే మిగిలాయి. సింగం గర్జనలన్నీ కలిసిరాలేదు.

ఊపందుకుంది

ఊపందుకుంది

విలన్స్ సక్సేనా, ఠాకూర్ అనూప్ సింగ్ పాత్రలు లార్జర్ దేన్ లైఫ్ అన్నట్లుగా సాగాయి. సింగం రెండు పార్ట్ లకు ప్లస్ లుగా నిలిచిన పాటలు ఈ సినిమాకు కలిసి రాలేదు. ఇంటర్వెల్ అయిన తర్వాత ఓ విలన్ ని అరెస్ట్ చేసిన దగ్గర నుంచీ కథ ఊపు అందుకుంది.

రాకింగ్

రాకింగ్

హైలెట్స్ లో ఆస్ట్రేలియా ఎపిసోడ్, హీరోయిజం ఎలివేషన్ లో పీక్ కు వెళ్లింది. వై వై వై వైఫై సాంగ్ స్క్రీన్ పై చాలా బాగుంది. శృతి హాసన్, లొకే్షన్స్ ఆ పాటలో చాలా బాగున్నాయి. అలాగే యూనివర్శల్ కాపో మాంటేజ్ సాంగ్ కూడా బాగుంది. సూర్య రాకింగ్ అనే చెప్పాలి.

హై డోస్ తో..

హై డోస్ తో..

ఫైనల్ గా ఫస్టాఫ్ సోసో అనిపిస్తే ..సెకండాఫ్ ...నాన్ స్టాఫ్ యాక్షన్ తో యాక్షన్ ప్రియులకు పండగ చేసింది. అయితే క్లైమాక్స్ లో వచ్చే ఛేజ్ సీన్ లెంగ్తీగా అనిపిస్తుంది. హై డోస్ ఉన్న యాక్షన్ సినిమా చూసిన ఫీలింగ్ వస్తుంది.

మధ్యాహ్నం షోలు పడతాయా

మధ్యాహ్నం షోలు పడతాయా

ఎన్నో అడ్డంకులను దాటుకుని గురువారం ఈ చిత్రం తమిళంలో విడుదలైనప్పటికీ.. సాంకేతిక కారణాలతో తెలుగులో వాయిదా పడింది. అయితే మార్నింగ్ షోలు మాత్రమే రద్దు అయ్యాయని,మధ్యాహ్నం, సాయింత్రం షోలు పడే అవకాసం ఉందని తెలుస్తోంది.

ఆగ్రహం

ఆగ్రహం

తమిళంలో సినిమా ఈ రోజు విడుదలవ్వగా .... తెలుగులో మాత్రం సాంకేతిక కారణాలతో కొన్ని చోట్ల సినిమా విడుదల వాయిదా పడింది. ఏపీ, తెలంగాణల్లో చాలా చోట్ల మార్నింగ్ షోలు పడలేదు. వాయిదాకు కారణం నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ల మధ్య చిన్న వివాదమే కారణమని తెలుస్తోంది. అయితే అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న ప్రేక్షకులు ఈ పరిణామాలతో ఇబ్బందులకు గురయ్యారు. థియేటర్స్ యాజమాన్యాలపై ఆగ్రహం వ్యక్తం చేసారు.

కీ కోడ్ రాలేదు

కీ కోడ్ రాలేదు

చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు అడ్వాన్స్ డబ్బులు చెల్లించక పోవడంతో ఆయా రీజియన్స్ లో శాటిలైట్ సిగ్నల్స్ ప్రొడ్యూసర్ లాక్ చేసినట్లు సమాచారం. చాలా చోట్ల మల్టిప్లెక్స్ ల్లో కూడా ప్రొడ్యూసర్ నుండి కీ కోడ్ రాక పోవడంతో మార్నింగ్ షోలు పడలేదు.
దీంతో సూర్య అభిమానులు నిరాశ చెందుతున్నారు. తెలుగులో ఈ సినిమాను మల్కాపురం శివకుమార్ రిలీజ్ చేస్తున్నారు.

ఊరట లభించింది

ఊరట లభించింది

మద్రాస్ హైకోర్టులో పైరసీని అడ్డుకోమంటూ టీమ్ విన్నవించుకోవడంతో, విచారణ చేపట్టిన కోర్టు, సర్వీస్ ప్రొవైడర్లకు పైరసీ అన్న పేరున్న సైట్లను బ్లాక్ చేయమని అదేశాలిచ్చింది. దీంతో సింగం టీమ్‌కు కొంత ఊరట లభించినట్లే అని చెప్పొచ్చు. హరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మించింది. సూర్య సరసన అనుష్క, శృతి హాసన్‌లు హీరోయిన్లుగా నటించారు.

English summary
After several rounds of postponements due to various reasons, superstar Suriya’s S3, the third outing from the successful Singam franchise, is releasing today. Singam-3 is a non-stop action movie which may work for Suriya Fans.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu