»   »  నర'సింహా'వతారం (సింగం ప్రివ్యూ)

నర'సింహా'వతారం (సింగం ప్రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : సూర్య, అనుష్క, హన్సిక ప్రధాన తారాగణంగా తమిళంలో రూపొందుతున్న 'సింగం-2' చిత్రం తెలుగులో 'సింగం' పేరుతో ఈ రోజు (జులై 5) వ తేదీన విడుదలకు సిద్దం అవుతోంది.

నరసింహం (సూర్య) బాధ్యతాయుతమైన పోలీసు అధికారి. జనక్షేమం కోసం ఎంతటివాళ్లనైనా ఎదిరిస్తాడు. తన వూరంటే ఎంతో ఇష్టం. సొంతూరిలో పని చేస్తూ కొన్ని పరిస్థితుల వల్ల గోవాకి వెళతాడు. అక్కడ కూడా అక్రమార్కుల భరతంపడతాడు. ఈసారి నరసింహం విదేశాలకు వెళ్లాల్సొచ్చింది. మరి అక్కడ ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయన్నది తెరపైనే చూడాలి.

హీరో సూర్య మాట్లాడుతూ ''నా జీవితంలో ఓ మైలురాయిలాంటి చిత్రం 'యముడు'. దానికి కొనసాగింపుగా వస్తున్న చిత్రమిది. పలువురు పోలీసు అధికారుల జీవితాల్ని పరిశీలించి ఇందులో నటించాను. తొలిభాగంలో ఉండే పాత్రలతో పాటు కొత్తవి కూడా చాలా కనిపిస్తాయి. కథనం, సంభాషణలు, పోరాటాలు ప్రేక్షకుల్ని అలరిస్తాయి'' అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ ...ఖాకీ దుస్తులకు గౌరవం తెచ్చిపెట్టే క్రమశిక్షణగల పోలీస్‌గా సూర్య ఈ చిత్రంలో సింహంలా నటించారని, ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ప్రత్యక్షమై శత్రువుల అంతుచూసే పోలీస్ పాత్రలలో సూర్య అద్భుతంగా నటిస్తారని, గతంలోనే రుజువైందని, ఇప్పుడు యముడు చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన 'సింగం'లో మరోసారి సూర్య విశ్వరూపం చూడవచ్చని తెలిపారు. హరితో ఆయన చేసిన చిత్రాలన్నీ విజయవంతమైనవేనని, అనుష్క, హన్సిక కథానాయికలుగా నటించిన ఈ చిత్రం మరోసారి హరి, సూర్య కాంబినేషన్ హిట్‌లని నిరూపణ అవుతుందని, నిర్మాత లక్ష్మణకుమార్ తెలిపారు.


ఈచిత్రంలో సూర్య యంగ్ అండ్ డైనమిక్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో విలన్ పాత్రలో హాలీవుడ్ నటుడు డానీ సపాని నటిస్తున్నారు. హాలీవుడ్ చిత్రాలైన Oxford Murders మరియు Trance చిత్రాల్లో డానీ సపాని నటించారు.


సంస్థ: ప్రిన్స్‌ పిక్చర్స్‌, స్టూడియో గ్రీన్‌
నటీనటులు: సూర్య, అనుష్క, హన్సిక, వివేక్‌, సంతానం, రాధా రవి, నాజర్‌, విజయ్‌కుమార్‌, ముఖేష్‌ రుషి, కె.విశ్వనాథ్‌ తదితరులు
ఎడిటింగ్: వి.టి.విజయన్,
మాటలు: శశాంక్ వెన్నెలకంటి,
కెమెరా: ప్రియన్
సంగీతం: దేవిశ్రీప్రసాద్‌
నిర్మాత: ఎస్‌.లక్ష్మణ్‌కుమార్‌
దర్శకత్వం: హరి
విడుదల: 05,జూలై 2013.

English summary
Suriya starrer Singam releasing today worldwide with highest number of prints. Touted as a high voltage action entertainer, Singam 2 begins from the end point of Singam and Narasimham will take on much powerful villains with international linkups this time. Hansika and Santhanam joins the cast and British actor Danny plays antagonist. Radharavi, Nasser, Rahman, Manorama, Vivek played other supporting roles. The commercial mass masala potboiler Singam is directed by Hari and produced by Prince Pictures banner with Devi Sri Prasad’s music.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu