»   » షాకయ్యేలా ఉంది: సూర్య ‘సింగం-3’ ఫస్ట్ లుక్ పోస్టర్

షాకయ్యేలా ఉంది: సూర్య ‘సింగం-3’ ఫస్ట్ లుక్ పోస్టర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సూర్య హీరోగా హరి దర్శకత్వంలో వచ్చిన ‘సింగం', ‘సింగం-2' భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా వీరి కాంబినేషన్లో తాజాగా మరో సీక్వెల్ రాబోతోంది. ఈ వారమే ఈచిత్రం ప్రారంభం కాబోతోంది. బుధవారం అర్ధరాత్రి ఈ చిత్రానికి సంబంధించిన న్యూ టైటిల్ అనౌన్స్ చేయడంతో పాటు ఫస్ట్ లుక్ విడుదల చేసారు. ఈ సారి టైటిల్ ‘సింగం-2' అని పెట్టకుండా ‘ఎస్ 3' అని పెట్టారు.

విశాఖపట్నంలో షూటింగ్ ప్రారంభంకానుంది. గత నెలలోనే ప్రారంభం కావల్సి ఉండగా తమిళనాడులో కురిసిన వర్షాల కారణంగా సినిమా నిర్మాణాన్ని వాయిదా వేశారు. సూర్య సొంత బేనర్‌ 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి హరి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రుతిహాసన్‌, అనుష్కశెట్టి ఇందులో ప్రధాన పాత్రలు నటించనున్నారు.

Surya's Singham 3 First Look poster

ప్రస్తుతం సూర్య నటిస్తున్న తమిళ్‌ థ్రిల్లర్‌ ‘24' త్వరలో విడుదల కానుంది. 24 చిత్రం నిర్మాణం పూర్తి కాబోతోందని తర్వాత సింగం 3పై దృష్టి పెడతానని సూర్య మీడియాకి వెల్లడించారు. ఈ చిత్రానికి విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వం వహించగా సమంత, నిత్యామేనన్‌ ప్రధాన పాత్రలు పోషించారు.

సూర్యకు ఈ మధ్య వరుసగా ఫ్లాపులు పలకరించాయి... 'సికిందర్, రాక్షసుడు' చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోరపరాజయం పాలు కావడంతో సూర్య ఇప్పుడు సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు... ఇంతకు ముందు ఇలాంటి పరిస్థితిలోనే సూర్యకు 'సింగం' చిత్రాలతో విజయాలను అందించాడు దర్శకుడు హరి... అదే తీరున సాగుతున్న సూర్యకు 'సింగం-3' కూడా విజయాన్ని అందిస్తుందని ఆశిస్తున్నారు.

English summary
Suriya-starrer Tamil actioner “Singam 3”, which goes on the floors this week, is all set to be rechristened. “The new title announced on Wednesday midnight. The title changed to S3 To be directed by Hari, the film will be produced by Suriya’s home banner 2D Entertainment.
Please Wait while comments are loading...