twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టుడే రిలీజ్ 'సెవెంత్ సెన్స్' కథ ఇదే

    By Srikanya
    |

    Seventh Sense
    ఈ రోజు సూర్య హీరో గా మురగదాస్ దర్శకత్వంలో రూపొందిన సెవెంత్ సెన్స్ చిత్రం విడుదల అవుతోంది. ఈ చిత్రం కథ ఆరవ శతాబ్దంలో ప్రారంభమవుతుంది. భోధి దమ్మ (సూర్య) ఓ పల్లవ రాజు కాంచీపురం నుంచి చైనాకు వెళ్లతాడు. అక్కడ ప్రజలకు ఆయన తన ధర్మం వ్యాప్తి చేస్తూ సహాయం చేస్తూ మార్షిల్ ఆర్ట్స్ విద్య నేర్పుతూ షావోలిన్ కి మూల పురుషుడు అవుతాడు. ఆయన తదనంతరం ఆయన్ని టావో గా చైనాలో పూజిస్తూంటారు. ఆ తర్వాత కథ ప్రస్తుత కాలానికి వస్తే అరవింద్(సూర్య) సర్కస్ లో పనిచేసే వ్యక్తి. అతను గ్రేట్ బొంబాయి సర్కస్ లో పనిచేస్తూంటాడు. అతను శుభ శ్రీనివాస్(శృతి హాసన్) తో ప్రేమలో పడతాడు. ఆమె ఓ రీసెర్చ్ స్టూడెంట్. అరవింద్ ఆమె అందానికి ముగ్దుడై ఆమె వెనకపడుతూంటాడు.

    అయితే ఆ తర్వాత శుభ తను వద్దకు రావటానికి ఓ బలమైన కారణం ఉందని అరదవింద్ కి తెలుసి షాక్ అవుతాడు. ఈ లోగా చైనా ..ఇండియాకు హాని చెయ్యటానికి ప్లాన్ చేస్తుందని తెలుస్తుంది.ఆ ఆపరేషన్ పేరు రెడ్. దాన్ని డాంగ్ లీ అనే చైనా వ్యక్తి నడుపుతూంటాడు. అతను మార్షిల్ ఆర్ట్స్ ఎక్సపెర్ట్. అతనికి శుభని చంపమని,ఆమె భోధి దమ్మ మీద చేసే రీసెర్చ్ ని ఆపమని ఆర్డర్స్ ఉంటాయి. ఇంతకీ శుభ కనుక్కున్న విషయం ఏమిటీ అంటే భోధి దమ్మ ఎవరో కాదు అరవింద్ వంశ మూల పురుషుడు. వారి ఇద్దరి డిఎన్ ఎ లు మ్యాచ్ అవుతాయి. ఆమె టాస్క్ ఏమిటంటే..మళ్లీ భోధి దమ్మకు ఈ డి ఎన్ ఎ సాయింతో ప్రాణం పోయాలని..ఆ విధంగా చైనా ప్లాన్ లను తిప్పి కొట్టాలని..ఆ విషయం తెలుసుకున్న అరవింద్ ఏం చేసాడు. ఎలా చైనా ప్లాన్ లను తిప్పి కొట్టి బారత్ దేశాన్ని కాపాడాడు అనేది మిగతా కథ.

    సైన్స్ కీ,మానవ నాగరకతకీ కొన్ని నమ్మకాలుకూ ముడివేసే ఈ కథలో సూర్య కొత్త అవతారంలో కనిపించనున్నాడు. కాగా 'గజిని" చిత్రంలో షార్ట్ టర్మ్ మెమోరీలాస్ పేషెంట్‌గా నటించి విమర్శకుల ప్రశంసలందుకున్న సూర్య ఈ చిత్రంలో సైంటిస్ట్ గా, బౌద్ధ సన్యాసిగా, సర్కస్ కళాకారుడిగా మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు. అయితే ఈ మూడు పాత్రల్లో ఒకటైన బౌద్ధ సన్యాసిగా సూర్య నటించిన పాత్ర ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కానుంది. అలాగే సర్కస్ కళాకారుడిగా నటించిన సూర్య ఈ పాత్ర కోసం వియాత్నాంలో కుంగ్‌ఫూకు సంబంధించి ప్రత్యేకంగా శిక్షణ తీసుకుని నటించాడు. ఈ చిత్రాన్ని లక్ష్మీగణపతి ఫిలింస్ పతాకంపై బి. సుబ్రహ్మణ్యం తెలుగులో అందిస్తున్నారు.

    English summary
    Surya playing a circus artist, as well as a Buddhist monk in China in the 14th century and a scientist roles in '7aam Arivu' ('The Seventh Sense' in Telugu) film, being directed by AR Murgadoss. This film is expected to release for Diwali 2011 festival season. Stan Winston Studios working for visual effects. Udhayanidhi Stalin is the producer for this film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X