సొంత నిర్మాణ సంస్థను మొదలెట్టిన హీరో సూర్య
తొలుత ఈ నిర్మాణ సంస్థపై తక్కువ బడ్జెట్ సినిమాలను నిర్మించాలనే యోచనలో ఉన్నాడట సూర్య. సంస్థ ఆర్థికంగా నిలదొక్కుకునే వరకు ఎక్కువ బడ్జెట్ సినిమాల జోలికి వెళ్లకూడదని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరో వైపు సూర్య సేవా కార్యక్రమాల విషయంలోనూ ముందున్నాడు. తన తండ్రి శివకుమార్ పేరుతో 'శ్రీ శివకుమార్ ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్టు' స్థాపించి పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు.
ఆ సంగతి పక్కన పెడితే సూర్య నటించిన 'సింగం' చిత్రం ఈ రోజు తెలుగులో విడుదలైంది. గతంలో తెలుగులో విడుదలైన 'యముడు' సినిమాకు సీక్వెల్ గా ఈ చిత్రం రూపొందింది. అంచనాలకు తగిన విధంగా ఉండటంతో సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
ఈ చిత్ర నిర్మాణ సంస్థ: ప్రిన్స్ పిక్చర్స్, స్టూడియో గ్రీన్, నటీనటులు: సూర్య, అనుష్క, హన్సిక, వివేక్, సంతానం, రాధా రవి, నాజర్, విజయ్‌కుమార్, ముఖేష్ రుషి, కె.విశ్వనాథ్ తదితరులు, ఎడిటింగ్: వి.టి.విజయన్, మాటలు: శశాంక్ వెన్నెలకంటి, కెమెరా: ప్రియన్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, నిర్మాత: ఎస్.లక్ష్మణ్‌కుమార్, దర్శకత్వం: హరి.


Click it and Unblock the Notifications












