»   » హీరో ట్వీట్....ఆమె ఆల్కహాలిక్ కాదు, నేను ఉమనైజర్ కాదు!

హీరో ట్వీట్....ఆమె ఆల్కహాలిక్ కాదు, నేను ఉమనైజర్ కాదు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్, టీవీ నటి అంకిత లోఖండె కొంతకాలంగా సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. గత ఆరేళ్లుగా ఇద్దరి మధ్య ప్రేమాయణం సాగుతోంది. 2009లో పవిత్ర రిష్ట సీరియల్ సమయంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అప్పటి నుండి ఇద్దరి మధ్య బంధం బలపడింది. జనవరిలో ఓ ఇంటర్వ్యూలో సుశాంత్ మాట్లాడుతూ ఈ ఏడాది చివర్లో తాము పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. అయితే ఏమైందో తెలియదు కానీ ఇద్దరి మధ్య బ్రేకప్ అయింది.

Also See: ఎం.ఎస్‌. ధోని పై సినిమా..టీజర్ ఇదిగో (వీడియో)

తమ బ్రేకప్ విషయాన్ని ఖరారు చేస్తూ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ట్వీట్ చేసారు. 'ఆమె ఆల్కహాలిక్ కాదు..నేను ఉమనైజర్ కాదు. సాధారణంగానే విడిపోతున్నాం. తప్పడం లేదు' అంటూ ట్వీట్ చేసారు. పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిన వీరి మధ్య ఉన్నట్టుండి ఏం జరిగింది? విడిపోవాలనేంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? అనేది తెలియడం లేదు.

టీవీ నటుడు అయిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్....బాలీవుడ్ అవకాశాలు రావడంతో హీరో అయ్యాడు. ప్రస్తుతం టీమిండియా క్రికెటర్ ధోనీ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న 'ఎం.ఎస్.ధోని' అనే చిత్రంలో నటిస్తున్నాడు.

Sushant Singh Rajput confirms split with girlfriend Ankita Lokhande

'ధోనీ' చిత్రంలో సుశాంత్ సింగ్ ధోనీ తొలినాళ్లలో లుక్ తలపించేలా జులపాల జుట్టుతో కనిపించబోతున్నాడు. ధోని మాధిరిగా హెలికాప్టర్ షాట్లు కొడుతూ సినిమాలో కనిపించబోతున్నారు. సినిమాలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ 7వ నెంబర్ గల టీమిండియా జెర్సీ ధరించి కనిపించనున్నాడు. 7 నెంబర్ అనేది ధోనీకి చాలా స్పెషల్. ఎందుకంటే ధోనీ పుట్టిన రోజు 7/7/1981.

English summary
Sushant Rajput broke his silence on the break-up for the first time via this tweet, which read: ‘Neither she was an alcoholic nor I am a womaniser . People do Grow apart & its unfortunate . Period!!’
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu